వాళ్లందరూ ఏమవ్వాలి సుక్కూ?
ఇంకో రెండు సినిమాలతో దర్శకత్వం చాలించేస్తా అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు సుకుమార్. ఈ విషయం తన భార్యకు కూడా ఆల్రెడీ చెప్పేశానన్నాడు. ఐతే ఆ స్టేట్ మెంట్ ఇచ్చాకే తెలిసింది సుక్కుకి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందని. సుక్కు స్టేట్ మెంట్ కు సంబంధించిన వార్తలు కనిపించిన చోటల్లా.. ‘‘వద్దు సార్’’ అంటూ కనిపించే స్టేట్ మెంట్లకు లెక్కే లేదు. ఇక ఇండస్ట్రీలో జనాలు కూడా సుక్కు విషయంలో ఇదే ఫీలింగులో ఉన్నారు. సుక్కు ఏమో సింపుల్ గా ఆ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు కానీ.. అతడితో సినిమా చేయాలని చాలామంది హీరోలు ఆశతో ఉన్నారు. ‘1 నేనొన్కడినే’ ఫ్లాప్ అయినా కూడా సుక్కుతో సినిమా చేయడానికి చాలామంది ఆసక్తి చూపగా.. ఇప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ సక్సెస్ అయ్యాక మరింతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సుక్కు ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా తీయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఇంతలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా అంటూ కొత్త కబురు వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మిస్తాడని అంటున్నారు. మరోవైపు సుక్కు ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ తోనూ మళ్లీ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇంతకుముందు చెప్పాడు. ఈ విషయంలో బన్నీ చాలా పట్టుదలగా ఉన్నాడట. ఇక మహేష్ మళ్లీ ఛాన్సిస్తే అతడికో హిట్టివ్వాలని సుక్కు అన్న సంగతి గుర్తుండే ఉంటుంది. మహేష్ కూడా సుక్కుతో మళ్లీ పని చేయడానికి రెడీ అన్నాడు కూడా. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూసి ఎగ్జైట్ అయిన పవన్ కళ్యాణ్ కూడా సుక్కుతో భవిష్యత్తులో ఓ సినిమా చేయడానికి ఆసక్తి చూపినట్లు కూడా వార్తలొచ్చాయి. మరోవైపు సుక్కు ఎన్టీఆర్ కోసం తయారు చేసిన మరో కథ కూడా రెడీగా ఉంది. సుక్కు ఓకే అనాలి కానీ.. ఎన్టీఆర్ ఎప్పుడైనా ఆ సినిమా చేయడానికి రెడీ. ఇంకోవైపు అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ కూడా సుక్కు కోసం ఆశ పడుతున్నాడు. మొత్తానికి ఇంతమంది సుక్కుతో పని చేయడానికి ఆసక్తిగా ఉంటే.. అతను రెండు సినిమాలతో ఎక్కడ ఆపగలడు చెప్పండి.