దసరాకు సుకుమార్ సినిమా లాంచ్ కాలేదే!

Update: 2019-10-09 13:05 GMT
'రంగస్థలం' తో సుకుమార్ సాధించిన విజయం సాధారణమైనది కాదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్ట్ తో హిట్ కొట్టడం కష్టం కాదు కానీ 'రంగస్థలం' లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆ పని చేయడమే కష్టం.  అయితే అలాంటి సినిమా తర్వాత వెంటనే సుకుమార్ కు సినిమా సెట్ కాలేదు.  మహేష్ బాబుతో సినిమా సెట్ అయింది కానీ అది క్యాన్సిల్ కావడంతో అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసుకున్నాడు.  అయితే ఈ సినిమాను ఎంతకూ లాంచ్ చేయకపోవడంతో సుక్కు అభిమానులకు నిరాశ తప్పడం లేదు.

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 'అల వైకుంఠపురములో' సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా జనవరిలో రిలీజ్ కానుంది. దీంతో బన్నీ - సుకుమార్ సినిమాను దసరాకు లాంచ్ చేస్తారని.. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని కొన్నివార్తలు కూడా వచ్చాయి.  అయితే దసరా వచ్చింది.. పోయింది.. సుక్కు - బన్నీ సినిమా మాత్రం లాంచ్ కాలేదు.  దీంతో సుక్కు అభిమానులలో ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే సుకుమార్ సన్నిహితులు మాత్రం ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. దేవీశ్రీ ప్రసాద్ ట్యూన్స్ చేయడం కూడా ప్రారంభించాడని అంటున్నారు.  'అల వైకుంఠపురములో' రిలీజ్ కాగానే ఈ సినిమాను లాంచ్ చేస్తారని.. ఎక్కువ గ్యాప్ లేకుండా సెట్స్ పైకి తీసుకెళ్తారని అంటున్నారు.
Tags:    

Similar News