BB4 : నవ్వుకుంటూనే వెళ్లిపోయిన జోర్దార్‌ సుజాత

Update: 2020-10-12 06:30 GMT
న్యూస్‌ రీడర్‌ గా తెలంగాణ యాసతో షో కు ప్రత్యేకంగా నిలుస్తుందని సుజాతను బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఎంపిక చేసి ఉంటారు. వారు అనుకున్నట్లుగానే తెలంగాణ యాసతో తెలంగాణ ప్రేక్షకులను ఆమె అలరించింది అనడంలో సందేహం లేదు. కాని ఆమె అకారణమైన నవ్వు మరియు ఊరికే వచ్చే ఏడుపు అలక ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి. బాబోయ్‌ సుజాత అనేట్లుగా ఆమె ప్రవర్తన ఉంది. పైగా అభిజిత్‌ విషయంలో ఆమె కన్ఫ్యూజన్‌ మరియు ఆమె మాటలు ఆమెపై మరింతగా ప్రేక్షకుల్లో వ్యతిరేకత కలిగించాయి. మొత్తానికి సుజాత అయిదు వారాల తన బిగ్‌ బాస్‌ జర్నీని ముగించుకుని తన ఇంటికి వెళ్లి పోయింది.

బిగ్‌ బాస్‌ నుండి బయటకు వెళ్లే సమయంలోనూ సుజాత కాస్త కన్నీరు పెట్టుకున్నా నవ్వుతూనే ఉంది. సుజాత వెళ్లి పోయిన సమయంలో ఇంట్లో సభ్యులు చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. అంతకు ముందు ఎపిసోడ్‌ లో గంగవ్వ అన్నట్లుగానే సుజాత ఎలిమినేట్‌ అయ్యింది. సుజాత ఎలిమినేషన్‌ తర్వాత నాగార్జునతో స్టేజ్‌ పై మాట్లాడుతూ కాస్త ఎమోషనల్‌ అయిన సుజాత హౌస్‌ మెంట్స్‌ తో మాట్లాడుతూ మళ్లీ అందరిని నవ్వించింది. జోర్దార్‌ గా హడావుడి చేసింది. ఇంట్లో ఉన్న వారిలో తన హాట్‌ బ్రేక్‌ చేసింది ఎవరు.. తనకు ప్రేమను అందించింది ఎవరు.. తనకు ఇష్టం లేని వారు ఎవరు అనే విషయాన్ని సుజాత చెప్పింది.

చాలా మంది అనుకున్నట్లుగా తన హార్ట్‌ ను అభిజిత్‌ బ్రేక్‌ చేశాడు అంటూ సుజాత చెప్పింది. అందుకు ఆమె చెప్పిన కారణం ఈసారి కూడా అర్థం కాలేదు. మొత్తానికి ఆ కన్ఫ్యూజ్‌ లో ఆమె ఉండి ప్రేక్షకులను కూడా కన్ఫ్యూజ్‌ లో పెట్టడం వల్ల మొదటికే మోసం వచ్చింది. అభిజిత్‌ విషయంలో క్లారిటీగా ఉండి మొత్తం ఓపెన్‌ అప్‌ అయ్యి ఉంటే బాగుండేది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జోర్దార్‌ సుజాత తన బిగ్‌ బాస్‌ జర్నీని ముగించింది.

వెళ్లి పోయే ముందు బిగ్‌ బాంబ్‌ ను సోహెల్‌ పై వేసి వెళ్లింది. బిగ్‌ బాంబ్‌ ఏంటీ అంటే ఈ వారం మొత్తం బాసనలు కడిగే పని. వారం నుండి కెప్టెన్‌ అవ్వడం వల్ల పని చేయని సోహెల్‌ ఈ పని చేయాలంటూ సుజాత చెప్పి వెళ్లి పోయింది. ఇక నేడు ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్‌ కు సంబంధించిన నామినేషన్‌ మళ్లీ రసాబాసగా సాగినట్లుగా ప్రోమో చూస్తే అనిపిస్తుంది.
Tags:    

Similar News