నాణానికి రెండు వైపులా ఉన్నా..Vక్టరీ ఒక వైపే!
సెప్టెంబర్ 5 .. ఓ ఇద్దరు హీరోలకు బిగ్ డే. ఎందుకంటే ఆరోజు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాని దాదాపు 200 దేశాల్లో ప్రేక్షకులు నిరభ్యంతరంగా వీక్షించబోతున్నారు. ఇలాంటిది టాలీవుడ్ లో ఇంతకుముందెన్నడూ లేదనే చెప్పాలి. స్ట్రీమింగ్ లైవ్ లో అసలేదీ పస ఉన్న తెలుగు సినిమా లేదు అనుకుంటున్న టైమ్ లో వస్తోంది ఈ మూవీ. అందుకే అంత క్యూరియాసిటీ. ఇంతకీ ఏదా సినిమా? అంటే.. ఇంద్రగంటి దర్శకత్వం వహించిన `వి`. నాని- సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. అదితీరావు హైదరి - నివేదా థామస్ నాయికలు.
ఈ శనివారం రాత్రి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వరల్డ్ ప్రీమియర్ కోసం సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా, ఈ చిత్రం ప్రీమియర్ ముందు ప్రచారం పరంగా సందడి చేస్తూ చిత్రబృందం కౌంట్ డౌన్ వీడియోలను విడుదల చేస్తోంది. కౌంట్‌డౌన్ కి ముందు .. ఈ రోజు సుధీర్ బాబు పాత్రలో ట్విస్టుల్ని రివీల్ చేసే వీడియోని రిలీజ్ చేశారు. నేరం.. న్యాయం సాధ్యాసాధ్యాలు.. అంటూ ఆసక్తికరమైన మలుపులు అతడి కాప్ పాత్రలో ట్విస్టులిస్తాయట. V లో హార్డెస్ట్ పోలీసు పాత్ర పోషిస్తున్న సుధీర్ బాబు నటనకు పేరొస్తుందని అంచనా వేస్తున్నారు.
``ప్రతి నాణానికి రెండు వైపులా ఉంటుంది. కానీ నాణెం విసిరిన తర్వాత.. V క్టరీ ఒక వైపు మాత్రమే పడుతుంది`` అంటూ ఆసక్తికరమైన డైలాగ్ క్యాప్షన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. మొత్తానికి వీ ప్రమోషనల్ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. మెజారిటీ అభిమానులు తొలి రోజే అమెజాన్ ప్రైమ్ లో `వి` మూవీని చూసే వీలుందని అంచనా వేస్తున్నారు.