• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బావని విలన్ అంటున్నారే!!

బావని విలన్ అంటున్నారే!!

By - Tupaki Desk
Update: 2017-07-11 04:21 GMT
ఇప్పటి యంగ్  హీరోలు కెరీర్ ను కొత్తగా డిజైన్ చేసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదు. హీరోగానే ఉండాలి.. మాస్ ఇమేజ్ తెచ్చేసుకోవాలి.. లాంటి చట్రాల్లో ఇరుక్కుపోవడం లేదు వీరంతా. అవసరం అయితే.. విలన్ గా నటించేందుకు కూడా వెనుకాడ్డం లేదు కొందరు యంగ్ స్టర్స్. సరైనోడు మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా నటించి ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో హీరో కూడా విలన్ అవతారంలో కనిపించబోతున్నాడట.

అతనెవరో కాదు.. మహేష్ బాబు బావ సుధీర్ బాబు. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన శమంతకమణి చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుండగా.. ఈ సినిమాలో నలుగురు కుర్రాళ్లు హీరోలుగా నటించారు. నారా రోహిత్.. సందీప్ కిషన్.. ఆది.. సుధీర్ బాబులు ఈ చిత్రంలో నటించగా.. వీరిలో సుధీర్ బాబు పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుందని తెలుస్తోంది. సుధీర్ చేస్తున్న ఈ రోల్ లో నెగిటివ్ కోణం ఉంటుందని.. సినిమాకు తనే విలన్ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నడూ కనిపించనంత కొత్తగా సుధీర్ బాబు పాత్ర ఉంటుందట.

అయితే.. సుధీర్ బాబుకు విలన్ పాత్ర చేయడం కొత్తేమీ కాదు కానీ.. టాలీవుడ్ లో చేయడం కొత్త విషయం. ఇప్పటికే బాఘీ అంటూ బాలీవుడ్ లో విలన్ గా నటించి మెప్పించాడు సుధీర్ బాబు. ఇప్పుడు టాలీవుడ్ కి కూడా తన విలనిజం చూపించబోతున్నాడన్న మాట. ఆఫర్ వస్తే.. బావ మహేష్ బాబుకు విలన్ గా అయినా నటించేస్తానని రీసెంట్ గా సుధీర్ బాబు చెప్పిన విషయం గుర్తుందిగా!



Tags:    
  • Sudheer Babu 
  • Samanthakamani Movie 
  • TElugu NEWs 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS