• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సీన్‌ సినిమా స్థాయిని...

ఆ సీన్‌ సినిమా స్థాయిని పెంచేసింది!

By - Tupaki Desk
Update: 2018-09-22 16:54 GMT
సుధీర్‌ బాబు హీరోగా నభా నటేష్‌ హీరోయిన్‌ గా తెరకెక్కిన చిత్రం ‘నన్నుదోచుకుందువటే’. ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విడుదలైన మొదటి రోజు ఈ చిత్రంకు మంచి స్పందన దక్కింది. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రావడంతో పాటు మొదటి రోజు మంచి వసూళ్లు కూడా దక్కాయి.  సినిమాకు వారాంతంలో మరింతగా మంచి వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ చిత్రంలోని ఒక సీన్‌ గురించి ప్రస్తుతం ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు తెగ చర్చించుకుంటున్నారు. సుధీర్‌ బాబు ఈ చిత్రంలో ఒక సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో సీరియస్‌ మేనేజర్‌ గా నటించాడు. చండసాసనుడైన మేనేజర్‌ పాత్రలో సుధీర్‌ బాబు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ కోసం ఒక షార్ట్‌ ఫిల్మ్‌ లో సదరు మేనేజర్‌ నటించాల్సి వస్తుంది. ఆ సీన్‌ లో సుధీర్‌ బాబు నటన నవ్వులు పూయించింది. నటనలో బేసిక్స్‌ తెలియని వ్యక్తిగా ఫేస్‌ ఫీలింగ్స్‌ పెట్టి - డైలాగ్‌ చెప్పే ఆ సీన్‌ బాగా పేలింది. ఇలాంటి ఒక సీన్‌ ను రాసినందుకు డైరెక్టర్‌ పై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది.  ప్రేక్షకులు ఆ సీన్‌ ను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే - ఆ కామెడీ సీన్‌ ఒక ఎత్తు అంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆ సీన్‌ తో పాటు మరికొన్ని కామెడీ సీన్స్‌ కూడా ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. సుధీర్‌ బాబు నిర్మాతగా మారి మొదటి సారి ఈ చిత్రంను నిర్మించడం జరిగింది. గత చిత్రాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని సుధీర్‌ బాబు ఒక మోస్తరు బడ్జెట్‌ తోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా సమాచారం అందుతుంది. తక్కువ బడ్జెట్‌ అవ్వడంతో పాటు సక్సెస్‌ టాక్‌ ను దక్కించుకున్న కారణంగా ఈ సినిమాతో సుధీర్‌ బాబుకు లాభాలు భారీగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Sudheer Babu 
  • Nannu Dochukunduvate Movie 

Similar News

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS