'శ్రీదేవి సోడా సెంటర్' లో సుధీర్ బాబు దీపావళి సెలబ్రేషన్స్..!

Update: 2020-11-14 06:45 GMT
టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''శ్రీదేవి సోడా సెంటర్''. 'పలాస 1978' సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకున్న కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రాన్ని అనౌన్స్ చేసిన మేకర్స్.. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో మూవీపై ఆసక్తిని కలిగించారు. ఇందులో సుధీర్ బాబు 'సూరిబాబు' అనే లైటింగ్ బాయ్ పాత్ర పోషిస్తున్నాడు. మోషన్ పోస్టర్ లో మెడ మీద కర్చీఫ్ - భుజానికి డెక‌రేష‌న్ లైట్స్‌ తగిలించుకుని చేతిలో గోళీసోడా పట్టుకొని ఉన్న సుధీర్ బాబు మాస్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి తాజాగా మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' లేటెస్ట్ పోస్టర్ లో హీరో సుధీర్ బాబు ఓ బెంచ్ పై కూర్చుని ఉన్నాడు. గోళీసోడాలో పెట్టిన తారాజువ్వను సుధీర్ తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నాడు. టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా సుధీర్ బాబు కెరీర్లోనే డిఫరెంట్ మూవీగా నిలిచిపోనుందని తెలుస్తోంది. గతంలో సుధీర్ తో 'భలే మంచి రోజు' చిత్రాన్ని తీసిన 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. 'శ్రీదేవి సోడా సెంటర్' షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Tags:    

Similar News