• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుధీర్ బాబుతో హ్యాట్రిక్...

సుధీర్ బాబుతో హ్యాట్రిక్ సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్..!

By - Tupaki Desk
Update: 2020-11-14 13:30 GMT
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుధీర్ బాబు. 'ప్రేమ కథా చిత్రమ్' 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' 'భలే మంచి రోజు' 'భాగీ' 'శమంతకమణి' 'సమ్మోహనం' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే వీటిలో 'సమ్మోహనం' సినిమా సుధీర్ బాబు కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 'వి' సినిమా చేశారు. ఇది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ సుధీర్ బాబు కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సుధీర్‌ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి మరో చిత్రం చేయబోతున్నారు.

దీపావళి పండుగ సందర్భాన్ని పురష్కరించుకుని ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. సుధీర్‌ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు - కిరణ్‌ బాలపల్లి నిర్మించనున్నారు. 'ఉప్పెన' ఫేమ్‌ కృతి శెట్టి ఇందులో హీరోయిన్‌ గా నటించనుంది. ఇంద్రగంటి ఆస్థాన ఛాయాగ్రాహకుడు పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందించనున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చనున్నారు. సుధీర్ బాబు కెరీర్ లో 14వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది. సుధీర్ - ఇంద్రగంటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    
  • Sudheer Babu 
  • Indraganti Mohana Krishna 
  • Hat trick Movie 
  • Benchmark Studios 
  • Kruthi Shetty 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS