• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరకు రాజుగా సైరా సుదీప్ ?

అరకు రాజుగా సైరా సుదీప్ ?

By - Tupaki Desk
Update: 2018-08-25 13:22 GMT
మనకంటే ఈగ విలన్ గా బాహుబలిలో చిన్న రాజుగా పరిచయమే కానీ కిచ్చ సుదీప్ కన్నడలో స్టార్ హీరో. మన భాషలో చెప్పాలంటే అక్కడి మార్కెట్ కు తగ్గట్టు ప్రభాస్ తరహా ఫాలోయింగ్ ని అక్కడ చూడొచ్చు. వీలు కుదిరితేనో లేక సబ్జెక్టు విపరీతంగా నచ్చితే తప్ప ఇతర భాషల్లో చేయడానికి ఒప్పుకోని సుదీప్ మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఊరుకుంటాడా. అందులోనూ సైరా లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అంటే ఎవరైనా ఓకే అనాల్సిందే. అఫ్ కోర్స్ సుదీప్ కూడా అదే చేసాడు లెండి. షూటింగ్ కూడా జరిగింది. కానీ ఏ పాత్ర పోషించాడు అనే దాని గురించి మాత్రం వివరాలు బయటికి రాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో సుదీప్ అరకు రాజుగా కనిపిస్తాడట. అరకు సంస్థానం తరఫున 1846లో గిద్దలూరు తిరుగుబాటులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు యుద్ధంలో పాల్గొన్న వీరుడిగా సుదీప్ పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందని టాక్.

అవుకు రాజుల్లో చివరివాడైన రాజుగా సుదీప్ తో పాటు వందకు పైగా స్వాతంత్ర సమర యోధులు అందులో పాల్గొని సుమారు 12 ఏళ్ళ దాకా అండమాన్ జైలులో దుర్భరమైన జైలు శిక్షకు గురవుతారట. అది జరుగుతుందని తెలిసే నరసింహరెడ్డితో పాటు కదన రంగంలోకి దూకిన ఆరకు రాజు అరాచకం చూడాలంటె ఇంకా చాలా టైం వెయిట్ చేయాలి కానీ ఈ న్యూస్ మాత్రం మెగా ఫాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. సుదీప్ ఉన్నందుకు శాండల్ వుడ్ లో సైరా మీద భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సుదీప్ ఏ ట్వీట్ చేసినా ఫాన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు. మెగా హీరోలకు అందులోనూ చిరుకి కర్ణాటకలో అభిమానులు ఎక్కువ. ఇక తమ సుదీప్ తో చిరు కలయిక అంటే  ఊరికే ఉంటారా. వచ్చే వేసవి విడుదల టార్గెట్ చేసుకున్న సైరా టీజర్ ఇటీవలే చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదలై 12 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
Tags:    
  • Sudeep 
  • Sye Raa Movie 
  • Telugu NEWs 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS