విజయవంతంగా ఫస్ట్ డే షూటింగ్ జరిపిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్..!!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల శివల తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ ఎవరంటే అది అనిల్ రావిపూడినే. తన ఫస్ట్ మూవీ పటాస్ సినిమా నుండి సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, లతో పాటు ఈ ఏడాది సంక్రాంతి బరిలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తన సినిమాలతో అటు మాస్.. ఇటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా అనిల్ రావిపూడి దగ్గరవుతున్నాడు. ప్రతి సినిమాలో కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న అనిల్.. తాజాగా ఎఫ్3 షూటింగ్ షురూ చేసాడు. గతేడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లను హీరోలుగా 'ఎఫ్2' రూపొందించి మంచి విజయం అందుకున్నాడు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా అలరించింది.
ఆ సినిమాకు సీక్వెల్ ఎఫ్3 ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఫస్ట్ డే షూట్ జరిపిన ఒక ఫోటోను అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. సక్సెస్ ఫుల్లీ మొదటి రోజు షూట్ ముగిసిందని తెలిపాడు. అయితే ఎఫ్3 షూటింగులో ప్రస్తుతం వణికిస్తున్న కరోనా మహమ్మారి నియమాలను పాటిస్తున్నారని మనకు ఫోటో చూస్తే అర్ధమవుతుంది. ఫోటోలో హీరో వెంకటేష్ తో పాటు అనిల్, ఇతర టెక్నీషియన్స్ అంతా మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. అలాగే మొహానికి కూడా మాస్క్ తో పాటు సేఫ్టీ షీల్డ్ ధరించిన విషయం కూడా మనం గమనించవచ్చు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనీ ట్రై చేస్తున్న ఈ సీక్వెల్ సినిమాలో కూడా అందాల భామలు తమన్నా, మెహరీన్ లే కథానాయికలు. మొత్తానికి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ స్టార్ట్ చేసాడు డైరెక్టర్ అనిల్.. చూడాలి మరి ఎఫ్3 తో ఎలా ఎంటర్టైన్ చేస్తారో..!!