అవ‌తార్ 2.. చ‌నిపోయిన భ‌యంక‌ర‌ విల‌న్ తిరిగొస్తాడా?

Update: 2022-12-12 02:30 GMT
జేమ్స్ కామెరూన్ 'అవతార్‌'లో విలన్ పాత్ర‌ను ఎవ‌రూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. కల్నల్ క్వారిచ్ క్రూర‌త్వం.. శత్రువుపై పోరాడే త‌త్వం.. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు.. టార్గెట్ పై దృష్టి.. ఇలా ప్ర‌తిదీ ఎంతగానో ఆక‌ట్టుకుంటాయి. అవ‌తార్ ల‌ను అంతం చేసే విల‌న్ గా అత‌డి ఆహార్యం న‌భూతోన‌భ‌విష్య‌తి. విల‌న్ అంటే ఇలా ఉండాలి! అన్నంత బ‌ల‌మైన పాత్ర అది. అంత గొప్ప విల‌నీని కామెరూన్ ప్రెజెంట్ చేసిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రం.

కానీ ఈ పాత్ర క్లైమాక్స్ లో 'చనిపోగానే ఆడియెన్ ఒక్క‌సారిగా రిలీఫ్ ఫీల‌య్యారంటే పాత్ర‌ధారి న‌ట‌న‌ ఎంత‌గా ప్ర‌భావ‌వితం చేసిందో అర్థం చేసుకోవాలి. విల‌న్ గుండెల్లో బాణాలు దిగ‌బ‌డ‌గానే ఒకేసారి ఆశ్చర్యం తో కూడుకున్న‌ ఉల్లాసాన్ని థియేట‌ర్ లో ప్రేక్ష‌కులు అనుభవించకుండా ఉండలేరు. తొలిగా .. ఇది చాలా మంచిది... అత‌డు చ‌చ్చాడు! అని భావిస్తాం. కానీ ఇక్క‌డే ఉంది ఇంకో ట్విస్టు. అవ‌తార్ లు సంధించిన రెండు బాణాలు గుండెల్లో దిగ‌బ‌డినా కానీ అత‌డు చావ‌డు. సీక్వెల్లో తిరిగి బ‌తికి వ‌స్తాడ‌న్న‌దే అస‌లైన ట్విస్టు. అయితే అది ఎలా సాధ్యం? అని ప్ర‌శ్నిస్తే దానికి జ‌వాబు తెర‌పైనే వెత‌కాలి అంటున్నాడు క‌ల్న‌ల్ సాబ్.

ఇప్పుడు సీక్వెల్ 'ది వే ఆఫ్ వాట‌ర్' 2009 అవ‌తార్ ని మించిన క‌థ‌తో తెర‌కెక్కిందని కామెరూన్ వ‌ర్గం చెబుతోంది. మంచి కథకి మంచి విలన్ కావాలి. కానీ భీక‌రుడైన‌ క‌ల్న‌ల్ () బాణాలు దిగ‌బ‌డి మ‌ర‌ణించాడు క‌దా? అన్న సందేహం అంద‌రిలోను అలానే ఉంది. కానీ అది నిజం కాదు.. కేవ‌లం భ్ర‌మ మాత్ర‌మేన‌ని తాజా ఇంట‌ర్వ్యూలో క‌ల్న‌ల్ పాత్ర‌ధారి క్రూరుడైన విల‌న్ స్టీఫెన్ లాంగ్ వెల్ల‌డించాడు.

మీరెవ‌రూ నా గురించి చింతించకండి.. మావెరిక్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ మీ కంటే రెండు అడుగులు ముందున్నారు. స్టీఫెన్ లాంగ్ అద్భుతమైన నమ్మకంతో పోషించిన కల్నల్ క్వారిచ్ డిసెంబర్ 16న మీ దగ్గరలోని థియేటర్ లోకి తిరిగి వస్తున్నాడు... అని తెలిపారు. సీక్వెల్ కోసం తాను తిరిగి వస్తానని ఊహించ‌లేద‌ని దాని గురించి మరచిపోయానని కూడా నటుడు స్టీఫెన్ లాంగ్ తెలిపారు. లాంగ్ నవ్వుతూ.. తనకు  కామెరాన్ కు మధ్య వాగ్దానాలేవీ లేవని చెప్పాడు.

స్టీఫెన్ ఇంకా చాలా సంగ‌తుల‌పై మాట్లాడుతూ-''నేను అవతార్ 2లో భాగమవుతానని జేమ్స్ కామెరాన్ నాకు వాగ్దానం చేయలేదు. ఉంటే ఉండొచ్చ‌ని మాత్ర‌మే అన్నాడు. నేను కూడా త‌న నుంచి ఎలాంటి వాగ్దానాలు కోరలేదు. అతను ఏదీ చేయలేదు. కొంత చిత్రీక‌ర‌ణ జ‌రిగాక‌ ఏదో ఒక సమయంలో సీక్వెల్లో అతను కల్నల్ క్వారిచ్ పాత్ర తిరిగి రాబోతోంద‌ని చెప్పాడు. అవతార్ చివరిలో చ‌నిపోయిన నేను మీకు తెలుసు కాబ‌ట్టి సంతోషం. నేను కూడా మీలానే థ్రిల్లింగ్ గా ఉన్నాను. ఎవరికైనా ఛాతీలో రెండు పెద్ద బాణాలు గుచ్చుకున్నప్పుడు ఒక నిర్దిష్టమైన‌ ముగింపు ఉంటుంది. ఆ సమయంలో చ‌నిపోయాన‌ని మీరు అనుకోవచ్చు. కాబట్టి నేను ఆ కాల్ ని (కామెరూన్ నుండి) స్వీకరించడం గొప్ప బోనస్ .. ఆశీర్వాదం.. నేను చాలా ముఖ్యమైన మార్గంలో తిరిగి తెర‌పైకి వచ్చాను'' అని తెలిపాడు.

అంద‌రికీ తెలిసినట్లుగా క్వారిచ్ క‌ఠినాత్ముడు. మానవుడు కాని ఏ జీవినైనా అసహ్యించుకునే వ్యక్తి. కాబట్టి పండోర స్థానికులు అవ‌తార్ ల‌ గురించి అతని ఆలోచ‌న ఎలా ఉంటుందో మ‌న‌మంతా ఊహించవచ్చు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' లో తన పాత్ర ప్రయాణం గురించి లాంగ్ ఆటపట్టించాడు త‌ప్ప పెద్ద‌గా ఏదీ రివీల్ చేయ‌లేదు.

''మీరు ఏది ఆశించినా.. నా పాత్ర దానిని ధిక్కరిస్తుంది!'' అని మాత్ర‌మే చెప్పాడు. అతడు ఏం చేసినా దానిని చూసి చూసి ప్రేక్ష‌కులు ఆశ్చర్యపోతారని నేను ఆశిస్తున్నాను.. నేను వేరే ఫ్రేమ్ వర్క్ లో ఉన్నప్పటికీ మీరు అతన్ని(విల‌న్ క‌ల్న‌ల్ ని) గుర్తిస్తారని నేను భావిస్తున్నాను. ఆయనలో ఉన్న దృక్పధం.. అహంకారం.. నాయకత్వ లక్షణాలను మీరు గుర్తిస్తారని భావిస్తున్నాను. మీరు ఆ అంచనాలతో థియేట‌ర్ కి వ‌స్తే అవ‌న్నీ నెరవేరుతాయని నేను భావిస్తున్నాను. అలాగే అతను ఎప్పుడూ పోరాటం కోసం ఎదురు చూస్తుంటాడు.

అతను పండోరా స‌మీపంలోనే ఉన్నాడు. అదే అతని లక్ష్యం. కానీ మేము ఈ పాత్రను దాచాం. అతను విలువైన ప్రతిదాని కోసం వ‌స్తాడు. గనిని త‌వ్వాల‌ని కొన‌సాగించే క్ర‌మంలో కొన్ని ఆశ్చర్యకరమైనవి బ‌య‌ట‌ప‌డాయి. ఎందుకంటే నా పాత్రను పునరావృతం చేయడంలో నిజంగా అర్థం ఉండదు. అది అర్ధంలేనిది.. రసహీనమైనది. కాబట్టి ఊహించనిది ఆశించండి.. అదే నేను తెర‌పై చెబుతాను'' అని స‌స్పెన్స్ ని లీడ్ చేశాడు.

అవ‌తార్ 2లో సామ్ వర్తింగ్టన్- జో సల్దానా- కేట్ విన్స్ లెట్ తదితరులు నటించ‌డం(వీఎఫ్ ఎక్స్ షాట్స్ కోసం అభినయించారు) అద‌న‌పు బోన‌స్. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16న భార‌త‌దేశం స‌హా ప‌లు దేశాల‌లో థియేట‌ర్ల‌లోకి వస్తోంది. అడ్వాన్స్ బుకింగుల‌తో బుక్ మై షో హోరెత్తుతున్న సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News