పిక్‌ టాక్‌ః అందాలు చూపుతూ 'చిల్' అంటున్న స్టార్‌ కిడ్

Update: 2021-03-24 05:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన సారా అలీఖాన్ బాలీవుడ్‌ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి సందడి అంతా ఇంతా కాదు. ఒక వైపు సినిమాలతో అలరిస్తూనే మరో వైపు సోషల్‌ మీడియాలో హాట్ ఫొటో షూట్‌ లతో అభిమానులను మరియు ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూ ఉండే సారా అలీఖాన్ తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో మరింతగా హాట్‌ టాపిక్ అయ్యింది. 'చిల్‌' పదం ఉన్న టీషర్ట్‌ వేసుకుని సముద్రపు ఒడ్డున అందాలు ఆరబోస్తూ సారా అలీ ఖాన్‌ చిల్‌ అవుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

2018 సంవత్సరంలో కేదార్‌నాద్‌ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇటీవల వచ్చిన కూలీనెం.1 సినిమాలో ఆకట్టుకున్న ఈ అమ్మడు త్వరలో అత్రంగీరే అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. సారా అలీ ఖాన్‌ కు సౌత్‌ భాషల నుండి కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ అమ్మడు నెట్టింట తెగ హడావుడి చేస్తోంది.
Tags:    

Similar News