స్టార్ కిడ్ కు కష్టాలు తప్పడం లేదు!

Update: 2020-05-24 06:57 GMT
ఆయనో స్టార్ కిడ్. డెబ్యూ.. రీ-లాంచ్.. ఇలా ఎన్ని పేర్లు మారుస్తున్నా లక్కు మాత్రం కలిసిరావడం లేదు.  ఇక ఈ బాబు కొత్త సినిమాను ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన ఒక డైరెక్టర్ చేతిలో పెట్టారు.  ఆ సినిమాను ఈ యువహీరో గారు జస్ట్ లైన్ వినేసి ఒప్పుకున్నాడట.  దీంతో ఇప్పుడు అదే దెబ్బేసేలా ఉందని అంటున్నారు.  సినిమా ఫలితం హీరో కెరీర్ ను తేల్చేస్తుంది అనే సమయంలో ఇలా జరగడం ఇబ్బందే కదా.

ఈ సినిమాను మొదట మంచి డేట్ చూసుకుని సమ్మర్ లో సోలోగా విడుదల చేద్దామని అనుకున్నారు. సినిమా హిట్ అయితే ఇక అబ్బాయి గారి కెరీర్ తారాజువ్వలా పైపైకి దూసుకుపోతుందని అనుకున్నారు. అయితే మహమ్మారి పుణ్యమా అని అది కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాను దసరాకు విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దసరాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ తప్పదు. ఎవరైనా పెద్ద హీరో సినిమా కనుక దసరా బరిలో ఉంటే ఈ యువహీరో సినిమాకు ఇబ్బంది తప్పకపోవచ్చు.

ఇక ఈ సినిమా దర్శకుడు సినిమాను నెమ్మదిగా పూర్తి చేసే రకం.  ఇప్పుడు డెడ్ లైన్ దసరాకు పెట్టుకున్నారు కాబట్టి అతి తక్కువ సమయంలో సినిమాను పూర్తి చెయ్యాలి. ఈ హడావుడి.. ఒత్తిడి కూడా సినిమా కంటెంట్ పై నెగెటివ్ గా ప్రభావం చూపిస్తుందేమో అని టాక్ వినిపిస్తోంది. మరి ఈ కష్టాలన్నీ దాటుకుని ఈ సినిమా విజయం సాధిస్తుందా అనేది  వేచి చూడాలి..


Tags:    

Similar News