• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాతగా మారిన స్టార్...

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్.. 'అవుట్‌ సైడర్స్' పేరుతో కొత్త బ్యానర్..!

By - Tupaki Desk
Update: 2021-07-15 07:45 GMT
సినీ ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు సొంత నిర్మాణ సంస్థలు పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు కూడా నిర్మాతలుగా మారారు. ఇప్పుడు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నూ కూడా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తింది. 'ఝుమ్మందినాధం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటింది. ప్రస్తుతం అక్కడ బిజీ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోన్న ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతగా మారుతోంది. దీని కోసం 'అవుట్‌ సైడర్స్ ఫిలింస్‌' అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

'సూపర్ 30' '83' 'సూర్మ' 'పికూ' 'ముబాకరన్' వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత ప్రంజల్ ఖంద్‌ దియా భాగస్వామ్యంలో తాప్సీ సినిమాలు నిర్మించనుంది. ఈ విషయాన్ని తాప్సీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గతేడాదితో ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయ్యాయని.. ఇన్నేళ్లలో చాలా నేర్చుకున్నానని తెలిపింది. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని..

ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని.. అందుకే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నానని తాప్సీ పేర్కొన్నారు. దీనికి తనకు అదృష్టం కలగాలని కోరుకుంటున్నానని.. అవుతూ సైడ్ నుండి ఉత్తమమైనదాన్ని తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ప్రామిస్ చేస్తున్నానని తాప్సీ చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో తాప్సీ తన 'అవుట్‌ సైడర్స్ ఫిలింస్‌' ప్రొడక్షన్‌ హౌజ్‌ లో ఫస్ట్ సినిమాని ప్రకటించారు. అజయ్‌ భాల్‌ దర్శకత్వంలో ''బ్లర్‌'' అనే చచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు ప్రంజల్ ఖంద్‌ దియాలతో కలిసి తాప్సీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సందర్భంగా ''బ్లర్‌'' చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. 2022లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరి హీరోయిన్ గా సక్సెస్ అయిన తాప్సి.. నిర్మాతగా ఏమేర రాణిస్తుందో చూడాలి.

కాగా, తాప్సి లీడ్ రోల్ చేసిన 'హసీనా దిల్ రుబా' సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇది ఆమె కెరీర్లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా. విక్రాంత్ మాస్సే - హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. టీ సిరీస్ ఫిలిమ్స్ మరియు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది.

ఇకపోతే తెలుగులో చివరగా 'గేమ్ ఓవర్' అనే బైలింగ్విల్ లో కనిపించిన తాప్సీ.. ఇన్నాళ్లూ మంచి కథ కోసం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో ''మిషన్ ఇంపాజిబుల్'' (Mishan Impossible) సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్' ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో తాప్సీ పన్నూ కూడా జాయిన్ అయ్యారు. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా.. దీపక్ యారగర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Tags:    
  • Tapsee pannu 
  • Tapsee pannu movies 
  • Tapsee pannu as producer 
  • Tapsee out siders 
  • Mishan Impossible 
  • Mishan Impossible shooting 
  • tapsee Mishan Impossible 
  • Mishan Impossible movie update 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS