• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరోయిన్ ఓటీటీ...

స్టార్ హీరోయిన్ ఓటీటీ సిరీస్ మిడిల్ డ్రాప్

By - Tupaki Desk
Update: 2021-11-27 07:30 GMT
ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్రారంభ‌మై మ‌ధ్య‌లో విభేధాల వ‌ల్ల ఆగిపోతే అది బిగ్ డిబేట్ కి కార‌ణ‌మ‌వుతుంది. ఇంత‌కుముందు శివ‌గామి సిరీస్ ని ఓటీటీ కోసం నిర్మించినా కంటెంట్ బాలేద‌ని మిడిల్ డ్రాప‌వ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇప్పుడు అదే తీరుగా బాలీవుడ్ అందాల క‌థానాయిక సోనాక్షి నటించిన ఓ సిరీస్ మిడిల్ డ్రాప్ అవ్వ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో `బుల్బుల్ తరంగ్` అనే చిత్రాన్ని ప్రకటించింది.

అయితే ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని గుస‌గుస వినిపిస్తోంది. సోనాక్షి కొంత కాలం క్రితం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ వార్తలను సోనాక్షి కానీ నిర్మాతలు కానీ మీడియాకు వెల్లడించలేదు. సోనాక్షి నిష్క్రమణ తర్వాత నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ను ఎందుకు వదులుకుందో క్లారిటీ రాలేదు.అలాగే సోనాక్షి స్థానంలో వేరొక‌రిని ఎంపిక చేసారా లేదా కూడా తెలీదు. 

నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిలిపివేయడానికి ఇతర బలమైన కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న‌ది వెల్ల‌డి కావాల్సి ఉంది. బుల్బుల్ తరంగ్ బలమైన సందేశంతో కూడిన సోష‌ల్ డ్రామా. శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన బుల్బుల్ తరంగ్ లో తాహిర్ రాజ్ భాసిన్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాలో రాజ్ బబ్బర్- సుస్మిత ముఖర్జీ కీలక పాత్రలు పోషించాల్సి ఉంది.

సోనాక్షి ప్ర‌స్తుతం త‌దుప‌రి సినిమాల‌పై దృష్టి సారించింది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం డబుల్ ఎక్స్ ఎల్ పనుల్లో బిజీగా ఉంది. ఇందులో హుమా ఖురేషి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    
  • sonakshi sinha 
  • ActressTollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS