అగ్ర హీరో కోసం వెయిట్ చేస్తే వడ్డీలతోనే వాతలు!
ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే ఉండే ఆ క్రేజే వేరు. లాభానికి లాభం.. పేరుకు పేరు ప్రతిష్ఠ! ఇవన్నీ ఉంటాయి. నిజానికి ఆ పెద్ద హీరో పేరుతో ఎందరో నిర్మాతలు ఎదిగారు. నేడు టాలీవుడ్ లో అగ్రజుల హోదాని కూడా అందుకున్నారు. ఆ హోదాల్ని అనుభవిస్తూ ఇండస్ట్రీలో బిజినెస్ సాగిస్తున్నారు. నిర్మాతలుగా.. పెట్టుబడి దారులుగా ఉన్నారు వీళ్లంతా.
కానీ ఇప్పుడు అవే బిగ్ హెడ్స్ కి తల బొప్పి కట్టేస్తోందట. సదరు అగ్ర హీరోని నమ్మి లక్షలు.. కోట్లలో పెట్టి ఇరుగుపొరుగున బ్లాక్ బస్టర్లు అయిన సినిమాల రీమేక్ హక్కుల్ని కొనుక్కుంటున్నారు. తమ ఫేవరెట్ హీరో హామీ ఇవ్వగానే వాటి రీమేక్ పనుల్ని చేయిస్తున్నారు. దానికోసం దర్శకుల్ని రచయితల్ని హైర్ చేసుకుని భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు.
అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. అసలు సినిమా సెట్స్ కెళ్లేదెపుడు? అంటే మాత్రం ఆన్సర్ దొరకడం లేదట. పెద్ద హీరోలతో సినిమా అన్న మాటే కానీ.. ఇప్పుడున్న మహమ్మారీ క్రైసిస్ లో సినిమా తీసి గట్టెక్కడమెలాగో అర్థం కావడం లేదు. దీనివల్ల ఏళ్లకు ఏళ్లు ఇలానే షూటింగుల్లేకుండా భయపడుతూ దేకిరిపోతే తీవ్ర పరిణామాల్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫైనాన్సులు తెచ్చి రీమేక్ హక్కులు కొని సెట్స్ కెళ్లాలని అనుకున్న వారికి ఆ మేరకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందట. పైసా ఆదాయం లేకపోయినా అలా కుప్పలు తెప్పలుగా వడ్డీలు కడుతున్న ఓ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అలో లక్ష్మణా అని బాధపడడంపై ఇన్ సైడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. పలు మలయాల బ్లాక్ బస్టర్ల రీమేక్ ల కోసం పలువురు దర్శకుల్ని ఎంపిక చేయగా ఆ నిర్మాతలు పెట్టుబడులు పెడుతూ అవి తిరిగి ఎలా వస్తాయా? అని వేచి చూస్తున్నారట. అయితే ఇప్పటికే సెట్స్ కెళ్లాల్సిన స్ట్రెయిట్ సినిమానే ఎప్పటికి తదుపరి షెడ్యూల్ కి వెళతారో క్లారిటీ రావడం లేదు. ఇలాంటప్పుడు తదుపరి రీమేకులకు ఆ అగ్ర హీరో ఎప్పటికి లైన్ క్లియర్ చేస్తారు? అన్నది టెన్షన్ పెట్టేస్తోందట.