• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతడికి ఛాన్స్‌ ఇచ్చి...

అతడికి ఛాన్స్‌ ఇచ్చి తలపట్టుకున్న స్టార్‌ హీరో

By - Tupaki Desk
Update: 2018-09-03 04:51 GMT
చాలా సంవత్సరాల క్రితం తనకు లైఫ్‌ ఇచ్చాడని ఒక స్టార్‌ హీరో తాజాగా ఫ్లాప్‌ డైరెక్టర్‌ కు ఛాన్స్‌ ఇచ్చి తల పట్టుకున్నాడు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో ఆ ఫ్లాప్‌ దర్శకుడికి ఛాన్స్‌ ఇవ్వడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాడు. స్టార్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న ఈయన గత కొంత కాలంగా ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. ఈమద్య ఒక సక్సెస్‌ వచ్చినా ఆ వెంటనే రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ డిజాస్టర్‌ లు పడ్డాయి. ఇదే సమయంలో వరుసగా నాలుగు అట్టర్‌ ఫ్లాప్‌ లను తెరకెక్కించిన దర్శకుడికి ఛాన్స్‌ ఇచ్చాడు.

సదరు దర్శకుడి పై నమ్మకం లేకున్నా కూడా తనకు కెరీర్‌ ఆరంభంలో లైఫ్‌ ఇచ్చాడనే ఉద్దేశ్యంతో ఆయన దర్శకత్వంలో తాజాగా ఈ హీరో ఒక చిత్రాన్ని చేశాడు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలోనే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ తో ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో - సినిమా విషయంలో కూడా హీరోకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. ఆ దర్శకుడిని నమ్మి ఛాన్స్‌ ఇచ్చినందుకు తనను నట్టేట ముంచే పరిస్థితి కనిపిస్తుందని ఆ హీరో సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా టాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈమద్య కాలంలో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏమాత్రం లేదు. హీరో మరియు దర్శకుడు ఇద్దరు కూడా ఫ్లాప్‌ లలో కొట్టు మిట్టాడుతున్న కారణంగా ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు కూడా ఆసక్తి చూపడం లేదని - ప్రేక్షకులు ఈ చిత్రంపై అంచనాలు పెట్టుకోవడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే రెండు ఫ్లాప్‌ లు వచ్చిన ఆ హీరో మూడవ ప్లాప్‌ ఖాయం అని ముందే ఫిక్స్‌ అయిపోయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అవకాశాలు ఇక రావడం కష్టం అనుకుంటున్న సమయంలో ఆ దర్శకుడికి వచ్చిన ఈ అవకాశం కూడా వినియోగించుకోలేక పోతున్నాడనే టాక్‌ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

Tags:    
  • Star Hero 
  • Movie Output 
  • Director 
  • Telugu News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS