ఓ వైపు సీనియర్ హీరోతో సినిమా చేస్తున్న సదరు స్టార్ డైరెక్టర్ ... సడెన్ గా రైవల్ కాంపౌండ్ హీరోతో సినిమాని ప్రకటించారు. అయితే దీనివల్ల అతడికి ఊహించని కొత్త ఇబ్బందులు తలెత్తే ఛాన్సుందని కొందరు గుసగుసలాడుతున్నారు! పైకి కనిపించకపోయినా.. పెద్ద వాళ్ళ లో లేకపోయినా..! ఆ ఇరు కాంపౌండ్ లో నేటి జెనరేషన్ మధ్య పొరపొచ్చాలు వచ్చేసాయి అని మాటా మంతీ సాగుతోంది. అయితే కుటుంబ హీరోల్లో మాత్రం అవి ఏవీ లేవు!! అన్నట్లుగా స్పెషల్ గా మీట్ అయి ఫోటోలు వదులుతూ వియ్ ఆల్ వన్!! అనే సంకేతాలు ఇస్తున్నారు.
నిజానికి తాజాగా ప్రకటించిన ఆ టాప్ హీరో సినిమా పై అటువైపు అగ్ర హీరో కం నిర్మాత బాగా వర్రీ అవుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ కథను సదరు దర్శకుడు తొలిగా తనకే వినిపించాడట. డేట్స్ ఇష్యూ రావడం.. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మూవీలో అలాంటి రోల్ చేస్తుండటంతో ఆ స్టార్ హీరో కం నిర్మాత ఈ కథ లో మార్పులు అడిగారని తెలిసింది.
కానీ ఈలోగానే సడెన్ గా ఈ కథ తన కాంపిటీటర్ దగ్గరకు వెళ్లడంతో ఇప్పుడు ఆ కాంపౌండ్ లో సదరు స్టార్ డైరెక్టర్ పై కాస్త ఘాటు పవనాలు వీస్తున్నాయని సమాచారం. ఏదేమైనా ఈ ఫ్యామిలీ గొడవలోకి ఓ స్టార్ డైరెక్టర్ చిక్కుకున్నాడు అన్నది వాస్తవం అంటూ ఒకటే మర్మరింగ్ వినిపిస్తోంది. ఇది నిజమా కాదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.