• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ క్రెడిట్ త్రివిక్రమ్ .....

ఆ క్రెడిట్ త్రివిక్రమ్ .. బన్నీలకు వెళుతుంది: తమన్

By - Tupaki Desk
Update: 2021-05-19 08:30 GMT
ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా తమన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఆయన చేసిన పాటలు జనంలోకి దూసుకు వెళ్లాయి. జనం నాల్కులపై ఆ పాటలే నాట్యం చేస్తున్నాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సినిమాకి ఆయన అందించిన పాటలకి విశేషమైన ఆదరణ లభించింది. ఆ పాటల హోరు .. జోరు ఇప్పటికీ తగ్గలేదు. ఆ పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ ను మూడగడుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో తమన్ ఈ సినిమాను గురించి మాట్లాడారు.

'అల వైకుంఠపురములో' సినిమా పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషం కలిగింది. అందరూ కూడా ఆ పాటలను పాడుకుంటున్నారు .. ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ పాటలకు డాన్సులు చేస్తుండటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. త్రివిక్రమ్ గారికి సంగీత సాహిత్యాల పట్ల మంచి అవగాహన ఉంది. తన కథకి .. సందర్భానికి తగిన పాట ఎలా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన తన భావాలను చక్కగా చెప్పడం వలన నాకు వర్క్ ఈజీ అవుతుంది.

ఇక బన్నీ గొప్ప డాన్సర్ .. ప్రతి పాటకు ఆయన న్యాయం చేస్తారు. ఆ పాటలకు ఆయన అంతలా కష్టపడటం వల్లనే ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా క్రెడిట్ విషయంలో 35 శాతం త్రివిక్రమ్ కు .. 35 శాతం బన్నీ కి వెళుతుంది. మిగతా 30 శాతం మాత్రమే నాకు చెందుతుంది. ఇక లిరిక్ రైటర్స్ ప్రతిభా పాటవాలు కూడా ఈ రెస్పాన్స్ కి కారణమని చెప్పుకోవాలి. ఒక సంగీత దర్శకుడిగా ఇది నా ఒక్కడి గొప్పతనమేనని చెప్పను .. ఇది సమష్టి కృషి" అని  చెప్పుకొచ్చారు.  
Tags:    
  • Ss Thaman 
  • Ala Vaikuntha Purramuloo 
  • Allu Arjun 
  • Trivikram 
  • Tollywood 
  • Telugu News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS