'అందరికంటే నేనే పెద్ద నటుణ్ని' అంటున్న రాజమౌళి

Update: 2020-04-03 14:00 GMT
ఎస్.ఎస్.రాజమౌళి అలుపెరగని దర్శక ధీరుడు. టాలీవుడ్ స‌త్తాను దేశ‌మంతా చాటిన ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే వెంట‌నే రాజ‌మౌళి అని చెప్పేయొచ్చు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఆయ‌న ప్రత్యేకత. పేరులో ఉండే యస్.యస్ ను సూపర్ సక్సెస్ గా మలుచుకున్న దర్శకుడు రాజమౌళి. మన టాలీవుడ్ లోనే టాప్ డైరెక్టర్ స్థాయి నుంచి మొత్తం మన ఇండియన్ సినిమాలోనే టాప్ డైరెక్టర్ గా ఒక్క సారిగా ఎదిగిపోయారు. దాని వెనుక ఎంతో కష్టమున్న సంగతి అందరికీ తెలిసిందే. రాఘవేంద్ర రావు శిష్యుడిగా 'స్టూడెంట్ నెం.1' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. తొలి సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్న రాజమౌళి తన విజయయాత్రను నేటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అది ఏ హీరోతోనైనా క‌చ్చితంగా హిట్ అవ్వాల్సిందే అనే రేంజ్ కి ఎదిగాడు. స్టూడెంట్ నంబర్ 1తో మొదలైన ఆయ‌న సినీ ప్రస్థానం సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూషన్ సినిమాలతో కొన‌సాగుతోంది.

ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాను ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇంత భారీ చిత్రాలను తీస్తూ కూడా రిలీజ్ కు ముందు టెన్షన్ పడని డైరెక్టర్ రాజమౌళి అని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సినిమా రిలీజ్ కి ముందు మీరు టెన్షన్ పడరా అని అడగగా..'నేను ప్రతీ సినిమాకూ నిర్మాతలాగే టెన్షన్ పడుతూ ఉంటాను, నా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ దాన్ని బయటకి కనిపించకుండా కవర్ చేస్తుంటాను. నేను అందరికంటే పెద్ద యాక్టర్ ని' అని సమాధానం ఇచ్చాడు. ఇదిలా ఉండగా ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించబడుతోంది. వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే రూ .800 కోట్లకు పైగా వ్యాపారం చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News