• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి సోదరుడి సినిమా...

రాజమౌళి సోదరుడి సినిమా ఏమైంది?

By - Tupaki Desk
Update: 2018-01-13 23:30 GMT
రాజమౌళి కుటుంబంలో అందరూ ప్రతిభావంతులే. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి.. సోదరుడు కీరవాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. రాజమౌళి సతీమణి రమ స్టైలిస్టుగా గొప్ప పేరే సంపాదించింది. రాజమౌళి మరో సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపే సంపాదించాడు. వీళ్లందరూ అందరికీ పరిచయమే కానీ.. రాజమౌళి మరో సోదరుడు ఎస్.ఎస్.కాంచి గురించి జనాలకు తెలిసింది తక్కువే. ‘అమృతం’ సీరియల్లో కీలక పాత్ర ద్వారా కొంత పేరు సంపాదించిన కాంచి.. ‘మర్యాద రామన్న’కు కథ అందించడంతో పాటు రాజమౌళి సినిమాలు మరి కొన్నింటికి రచనా సహకారం అందించాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కాంచి గత ఏడాదే దర్శకుడిగా కూడా మారాడు. తొలి ప్రయత్నంలో ‘షో టైం’ అనే విభిన్నమైన సినిమాకు శ్రీకారం చుట్టాడు. ‘బాణం’ ఫేమ్ రణధీర్.. కొత్తమ్మాయి రుస్కార్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఫస్ట్ టీజర్.. ట్రైలర్ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. విభిన్నమైన థ్రిల్లర్ సినిమా చూపించేలా కనిపించాడు కాంచి. గత ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్ర ఆడియో వేడుకను ఘనంగా చేశారు. రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్.. కీరవాణి.. వీళ్లంతా వచ్చి కాంచి గురించి.. ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. సినిమాకు బజ్ కూడా వచ్చింది. ఇక విడుదలే తరువాయి అనుకుంటుండగా.. సినిమా వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడు దాని స్టేటస్ ఏంటో కూడా తెలియదు. ఎప్పుడు రిలీజవుతుందో తెలియదు. మంచి బజ్ ఉన్నపుడు దాన్ని ఎందుకు రిలీజ్ చేయలేదో.. ఆ తర్వాత పూర్తిగా దాన్ని పట్టించుకోకుండా ఎందుకొదిలేశారో తెలియదు.
Tags:    
  • SS Kanchi 
  • Show Time Movie 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS