• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇష్యూ మరింత సీరియస్‌...

ఇష్యూ మరింత సీరియస్‌ అయ్యింది

By - Tupaki Desk
Update: 2018-10-28 07:55 GMT
బాలీవుడ్‌ లో మొదలైన మీటూ ఉద్యమం సౌత్‌కు చేరిన విషయం తెల్సిందే. సౌత్‌ స్టార్‌ హీరో అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్నాయి. మీటూ ఉద్యమంలో భాగంగా ఇప్పటి వరకు లైంగిక ఆరోపణలు చేసిన వారు ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. కాని శృతి హరిహరన్‌ మాత్రం మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు అర్జున్‌ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో వివాదం మరింత ముదిరింది.

సినిమా షూటింగ్‌ సమయంలో రిహార్సల్స్‌  పేరుతో దర్శకుడు చెప్పకుండానే తనను దగ్గరకు తీసుకుని, అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు సెక్యువల్‌ హెరాస్‌ మెంట్‌ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్‌ ఐ ఆర్‌ కూడా నమోదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. మరో వైపు శృతిపై అర్జున్‌ పరువు నష్టం దావా వేశాడు. తనపై లేనిపోని లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన కారణంగా ఆమె తనకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు.

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు అంబరీష్‌ సారథ్యవంలో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాని వివాదం మరింత ముదురుతోంది. తనపై పరువు నష్టం దావా వేసినందుకు గాను లైంగిక వేదింపుల కేసును శృతి హరిహరన్‌ బుక్‌ చేయించినట్లుగా తెలుస్తోంది. అర్జున్‌ పై కేసు నమోదు అవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయ్యింది.

ఒకవైపు కన్నడ సినీ పరిశ్రమ పెద్దలు రాజీకి ప్రయత్నాలు చేస్తుండగా, అర్జున్‌ కూడా రాజీకి ఓకే అంటున్నా కూడా శృతి హరిహరన్‌ మాత్రం ఏమాత్రం తగ్గేది లేదని, తన మాటలకు కట్టుబడి ఉన్నానని అంటూనే, మరో వైపు కేసు కూడా పెట్టి సంచలనం సృష్టించింది. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో అంటూ అర్జున్‌ అభిమానులు మరియు కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Sruthi Hariharan 
  • sexual harassment 
  • Arjun Sarja 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS