బాలయ్య డైరక్టర్ అతన్ని పట్టాడా?

Update: 2016-09-27 11:30 GMT
ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ మసాలా సినిమాలను చూస్తుంటే జనాలు ఎందుకో పెద్దగా కిక్ ఫీలవ్వట్లేదు. అందుకే మసాలా సినిమాలనే నమ్ముకున్న డైరక్టర్లకు కాస్త ఇబ్బందిగానే ఉంది పరిస్థితి. ఈ సంవత్సరం మొదట్లో ''డిక్టేటర్'' సినిమాతో వచ్చిన శ్రీవాస్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు మరి.

చాలా రోజులు ఫ్లాపులతో సతమతమైన ఈ దర్శకుడు.. లౌక్యం సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడని అనుకున్నారు అందరూ. అయితే ఈ సినిమా అచ్చం శ్రీను వైట్ల సినిమాల తరహా ఫార్మాట్లో ఉన్నా కూడా.. గోపిచంద్ అండ్ రకుల్ ప్రెజెన్స్ కారణంగా సినిమా ఆడేసింది. ఆ తరువాత బాలయ్యతో తీసిన డిక్టేటర్ మాత్రం వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు శ్రీవాస్ తదుపరి సినిమా అనేదే ఓకే కాలేదు. కాకపోతే మనోడు హీరో విశాల్ ను ఒక కథతో ఇంప్రెస్ చేశాడట. యథావిథిగా కథకు కోన వెంకట్ మాటలు అందిస్తాడట. పైగా ఈ సినిమాను తమిళంలో విశాల్ నిర్మిస్తుంటే తెలుగులో శ్రీవాస్ నిర్మించే ఛాన్సుంది. పైగా ఇదే తెలుగులో విశాల్ మొదటి సినిమా అవుతుంది కూడా.

ఇంతవరకు అఫీషియల్ ప్రకటన ఏదీ వెలువడలేదు కాని.. అసలు ఈ ప్రాజెక్టు ఓకె అయితే మాత్రం శ్రీవాస్ కాస్త జాగ్రత్తగానే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News