ఫస్ట్‌ లుక్‌: అల్లూ వారి శ్రీరస్తు శుభమస్తు

Update: 2016-02-14 06:40 GMT
నిన్న అల్లు శిరీష్ ఓ పెద్ద కన్ ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. త్వరలోనే తనకు శ్రీరస్తు శుభమస్తు ఫిక్స్ అయిందని.. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ట్వీట్ చేశాడు. మిగిలిన వివరాలు త్వరలోనే చెబుతానని చెప్పాడు కానీ అసలు డీటైల్స్ చెప్పలేదు.  అయితే.. ఇప్పుడు మాత్రం అసలు విషయం తెలిసిపోయింది. శిరీష్ చేయబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ పేరే 'శ్రీరస్తు శుభమస్తు'.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై.. పరశురామ్ డైరెక్షన్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమాకి శ్రీరస్తు శుభమస్తు అనే పేరు ఫిక్స్ అయింది. ఇందులో అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఇప్పుడీ మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో బోలెడంత తారాగణం ఉంది. అచ్చమైన తెలుగింటి పెళ్లిని ప్రతిబింబించేలా ఫస్ట్ పోస్టర్ డిజైన్ చేశారు. వయ్యారంగా హీరోయిన్ లావణ్య ఒళ్లో  పడుకుని పోజిచ్చాడు శిరీష్.

చిన్న చిత్రాల కోసం గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పెట్టినా.. తన కొడుకు సినిమా కావడంతో తన మెయిన్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని రూపొందిచారు అల్లు అరవింద్. కొత్త జంట తర్వాత చాలా గ్యాప్ తీసుకుని శిరీష్ చేసిన సినిమా కావడంతో.. ఇప్పుడు ఫ్యామిలీ మూవీ లుక్ ఇవ్వడంతో.. శ్రీరస్తు శుభమస్తు చిత్రంపై పాజిటివ్ అంచనాలు ఏర్పడ్డాయి.
Tags:    

Similar News