• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నైజాంలో శ్రీమంతుడి పని...

నైజాంలో శ్రీమంతుడి పని పూర్తయింది

By - Tupaki Desk
Update: 2015-08-13 17:45 GMT
రెండు పెద్ద ఫ్లాపుల తర్వాత ఏ హీరో  మార్కెట్ అయినా కొంచెం తగ్గక తప్పదు. ముందు సినిమాకు పెట్టిన స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి బయ్యర్లు ముందుకు రారు. రేటు విషయంలో బేరాలు తప్పవు. కానీ మహేష్ బాబు మార్కెట్ మాత్రం 1 నేనొక్కడినే, ఆగడు లాంటి ఫ్లాపుల తర్వాత కూడా ఏమాత్రం చెక్కుచెదరలేదు. అంత పెద్ద ఫ్లాపుల తర్వాత కూడా మహేష్ మార్కెట్ కొంచెం పెరిగింది తప్ప తగ్గలేదు. ‘శ్రీమంతుడు’ సినిమాకు మహేష్ కెరీర్లోనే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద బిజినెస్ ఏరియా అయిన నైజాంలో అభినాష్ పిక్చర్స్ అనే సంస్థ చాలామందితో పోటీ పడి రూ.14.5 కోట్లకు రైట్స్ తీసుకుంది. మహేష్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ రెండు ఫ్లాపుల తర్వాత తీసిన సినిమా కాబట్టి ఇది సాహసమే అనుకున్నారంతా. బయ్యర్ రిస్క్ చేశాడేమో అని భావించారు.

కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దిమ్మదిరిగిపోతోంది. తొలి నాలుగు రోజుల్లోనే నైజాంలో 12 కోట్లతో నాన్ బాహుబలి రికార్డును అందుకుంది శ్రీమంతుడు సినిమా. ఆరో రోజుకే 14 కోట్ల మార్కును దాటేసింది. అంటే వారం రోజులకే పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేస్తోందన్నమాట. శ్రీమంతుడు నైజాం ఏరియా గ్రాస్ వసూళ్లు ఇప్పటికే 20 కోట్ల మార్కును అందుకున్నాయి. రెండో వారం నుంచి వచ్చేదంతా లాభమే అన్నమాట. మంగళవారం వరకు జోరుమీదున్న శ్రీమంతుడు బుధ, గురు వారాల్లో కొంచెం జోరు తగ్గించాడు. ఐతే రాబోయేది వీకెండ్.. పైగా స్వాతంత్ర్య దినోత్సవ సెలవు, ఆదివారం కలిసొస్తున్నాయి. కాబట్టి సెకండ్ వీకెండ్ లో శ్రీమంతుడు మళ్లీ జోరందుకోవడం ఖాయం. ఈ శుక్రవారం రెండు సినిమాలు లైన్ లో ఉన్నప్పటికీ ‘శ్రీమంతుడు’కి పెద్దగా ఇబ్బందేమీ ఉండదనే అనుకోవాలి.
Tags:    
  • Mahesh babu 
  • Shruthi Hassan 
  • Srimanthudu Movie 
  • Telugu News 

Similar News

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

Copyright @2026

Powered by Blink CMS