జూనియర్ అతిలోకసుందరినే పడగొట్టిన అర్జున్ రెడ్డి

Update: 2018-11-26 06:23 GMT
పట్టుమని పది సినిమాలు కూడా పూర్తి చేయకుండానే 60 కోట్ల షేర్ రాబట్టగలిగే  రేంజ్ కు చేరుకున్న విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఫిలిం నగర్ జనానికి అంతు చిక్కడం లేదు. సినిమాలో యావరేజ్ కంటెంట్ ఉన్నా చాలు బ్లాక్ బస్టర్ కు తగ్గకుండా హిట్ కొట్టిస్తున్నారు ప్రేక్షకులు. టీవీలో సైతం ఇండస్ట్రీ హిట్స్ ని మించిన టిఆర్పి రేటింగ్స్ వస్తున్నాయి. నోటా లాంటి తీసికట్టు కథలు ఉంటే తప్ప విజయ్ సినిమాలు ప్లాప్ కావు అనే అభిప్రాయానికి ట్రేడ్ వచ్చేసింది. టాక్సీవాలా కూడా దుమ్ము దులుపుతోంది.

ఈ క్రేజ్ మేనియా అంతా మనకే పరిమితం అనుకుంటే పొరపాటు. మనోడికి నార్త్ లో కూడా భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరో అయితే పర్వాలేదు ఏకంగా అతిలోకసుందరి తనయ జాన్వీ కపూర్ మనసును కూడా గెలుచుకున్నాడు. ఇటీవలే కాఫీ విత్ కరన్ షోలో అన్నయ్య అర్జున్ కపూర్ తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్ ని యాంకర్ కరన్ జోహార్ ఓ ప్రశ్న వేసాడు. ఒకవేళ ఉదయాన్నే లేచినప్పుడు అబ్బాయిగా మారిపోవాల్సి వస్తే ఎవరిలా ఉండాలని కోరుకుంటావు అని అడిగాడు. అంతే వెంటనే తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. అంతే కాదు త్వరలో సినిమా చేయాలనే కోరిక కూడా ఉందట.

పక్కనే ఉన్న అన్నయ్యలా కాకుండా లేక బాలీవుడ్ లో స్టార్స్ గా వెళ్లిపోతున్న వాళ్ళను కాకుండా సౌత్ లో ఓ అప్ కమింగ్ హీరో పేరు చెప్పిందంటే మాటలా. చిరంజీవి అన్నట్టు విజయ్ దేవరకొండ యాక్టర్ నుంచి స్టార్ గా ఎదిగిపోయాడు అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. జాన్వీ కపూర్ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంది కానీ మనసులోనే దాచుకున్న అమ్మాయిలు ఎన్ని లక్షల్లో ఉన్నారో.
    

Tags:    

Similar News