రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో హీరో తర్వాత అంత ప్రాధాన్యమున్న పాత్ర చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ చిత్రంలో హీరోయిన్ల కంటే కూడా హీరో ఫ్రెండుగా శ్రీవిష్ణు పాత్రే కీలకమని ముందు నుంచి చిత్ర బృందం చెబుతోంది. రీ రికార్డింగ్ కోసం సినిమా చూసిన దేవిశ్రీ ప్రసాద్ సైతం ఈ సినిమాలో శ్రీవిష్ణు పాత్రకున్న ప్రాధాన్యం గురించి చెప్పాడు. ఇలాంటి సినిమాను రామ్ ఒప్పుకోవడం గొప్ప విషయమన్నాడు. అతనే కాదు.. హీరో.. దర్శకుడు కూడా శ్రీవిష్ణు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పారు. అంతగా ఈ పాత్రలో ఏముంది అని శ్రీవిష్ణును అడిగితే.. నిజంగానే ఈ పాత్ర చాలా స్పెషల్ అంటున్నాడు.
‘‘ఉన్నది ఒకటే జిందగీ సినిమా మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఎక్కడ చూసినా కథ నా పాత్రతో ముడిపడి ఉంటుంది. ప్రతి సన్నివేశంలోనూ నా ప్రస్తావన ఉంటుంది. నేను అన్ని సన్నివేశాల్లో కనిపించకపోయినా.. అన్ని సీన్లలో నా పాత్ర ప్రమేయం ఉంటుంది. నా పాత్ర చూశాక ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి ఫ్రెండ్ ఒకడుంటే బాగుండనిపిస్తుంది. నా క్యారెక్టర్ అంత బాగా.. అంత సహజంగా.. అంత కీలకంగా ఉంటుంది. ఎక్కడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్టుగా ఉండే పాత్ర ఇది. ఈ సినిమాలో నా పాత్రకు జోడీ ఏమీ లేదు. కానీ ఈ పాత్రలో ఒక మ్యాజిక్ లాంటిది ఉంటుంది. అదేంటో సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ చిత్ర దర్శకుడు కిషోర్ తో నాకు మంచి స్నేహం ఉంది. ఆయన వల్లే ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అని శ్రీవిష్ణు తెలిపాడు. తాను హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’ విడుదలకు సిద్ధమవుతోందని.. దీని తర్వాత ‘నీది నాది ఒకే కథ’.. ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాలు చేస్తున్నానని శ్రీవిష్ణు చెప్పాడు.