'అప్పుడు పెద్ద పత్తిత్తుల్లా బిహేవ్ చేశారు.. ఇప్పుడు రంకు పురాణాలు బయటకు వస్తున్నాయి'

Update: 2020-09-13 09:50 GMT
సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న 25 మంది సినీ ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ పేరు ప్రధానంగా వినిపించడంతో టాలీవుడ్‌ లో కూడా డ్రగ్ ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే డ్రగ్స్ ఇష్యూలో రకుల్ పేరు ఉందన్న వార్తలపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. డ్రగ్స్ కేసులో రకుల్ ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ.. ఆరోజు ఎవరైతే నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెద్ద పత్తిత్తుల్లా బిహేవ్ చేశారో.. ఈరోజు అందరి రంకు పురాణాలు.. చెత్త యవ్వారాలు బయటకు వస్తున్నాయని రకుల్‌ పై సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.  

''ఇది రివేంట్ అని నేను అనుకోవడం లేదు. నేను క్యాస్టింగ్ కౌచ్‌ పై ఉద్యమం చేస్తున్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో 'టాలీవుడ్‌ లో క్యాస్టింగ్ కౌచ్ కాని.. డ్రగ్స్ లాంటివి ఏమీ ఉండవు.. మా ఆర్టిస్టులను లం** అంటారా' అంటూ మాట్లాడింది. మంచు లక్ష్మి అయితే డ్రగ్స్ ఆరోపణలకు నిరసనగా క్యాండిల్స్ వెలిగించి మా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ ఉన్నాయా? మా ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మా ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉందా? అంటూ సిగ్గు లేకుండా క్వశ్చన్ చేశారు. ఈరోజు డ్రగ్స్ తీసుకున్నట్లుగా రకుల్ ప్రీత్ సింగ్‌ కి రిలేటెడ్ గా న్యూస్ వస్తున్నాయి. ఆ రోజు రకుల్ క్యాస్టింగ్ కౌచ్ లేదండీ.. అదండీ.. ఇందండీ.. టాలీవుడ్ సూపర్ అండీ.. డూపర్ అండీ.. డ్రగ్స్ ఏమో తెలియడండీ అంటూ పత్తిత్తు కబుర్లు చెప్పింది. మళ్ళీ ముంబై వెళ్లి.. క్యాస్టింగ్ కౌచ్ ఉండకూడదు.. ఇక్కడ బాగా ఉంది.. అది ఉంది.. ఇది ఉంది అని పబ్లిసిటీకి నోటికొచ్చినట్టు అక్కడ మైక్‌ ల ముందు మాట్లాడింది. అక్కడ మైకుల ముందు ఒకలా ఇక్కడ మైకుల ముందు ఒకలా మాట్లాడుతుంది. బాలీవుడ్‌ లో మాట్లాడితే టాలీవుడ్‌ కి తెలియదని అనుకుంటుందో ఏమో'' అని శ్రీరెడ్డి మాట్లాడింది.

''ఈరోజు డ్రగ్స్ కేసులో రకుల్ ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ.. ఆరోజు ఎవరైతే నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెద్ద పత్తిత్తుల్లా బిహేవ్ చేశారో.. ఈరోజు మొత్తం అందరి రంకు పురాణాలు.. చెత్త యవ్వారాలు.. ఇల్లీగల్ యాక్టీవిటీస్ బయటకు వస్తున్నాయి. సరే నాకు ఎలాగో బ్యాడ్ నేమ్ వస్తే వచ్చింది. వాటిని మోసాను. ఇప్పటికైనా అందరి క్యారెక్టర్స్ గుర్తు తెచ్చుకోండి. ఇన్కమ్ టాక్స్ రైడ్స్ అవ్వొచ్చు.. డ్రగ్స్ కేసులు అవ్వొచ్చు.. కరోనా అవ్వొచ్చు.. నన్ను నిందించిన వాళ్లు ఇప్పుడు పాపం అనుభవిస్తున్నారు. పాపం ఊరికే వదలదు. పట్టి కుదిపేస్తది. దాన్నే మనం కర్మ అంటాం. ఈరోజు ఆ కర్మ అనుభవిస్తున్నారు. కర్మ కి ఉన్నోళ్లు లేనోళ్లు అందగత్తెలు అనే బేధం ఉండదు. అందరి తాట... అన్నమాట'' అంటూ రకుల్‌ ప్రీత్ సింగ్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి.
Tags:    

Similar News