'కింగ్' సెట్స్‌లో కూతురు కాదు.. కో-స్టార్ మాత్రమే!
తాజాగా కుమార్తె విషయంలో కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. సుహానాకు ఈ సినిమా ఒక గొప్ప అభ్యాసం కావాలని షారుక్ కోరుకుం టున్నారు.;
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ వృత్తి పట్ల ఎంత అంకితభావంతో ఉంటారో? తెలిసిందే. ఇప్పుడు అదే ప్రొఫెషనలిజం కుమార్తె సుహానా ఖాన్ విషయంలోనూ కనిపిస్తోంది. ఇద్దరు కలిసి `కింగ్` సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ సెట్స్‌లో షారూఖ్ తన కుమార్తెకు ఎలాంటి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆమెను ఒక తోటి నటిగా మాత్రమే చూస్తున్నారని నటుడు సౌరభ్ శుక్లా వెల్లడించారు. తండ్రిగా ప్రేమ ఉన్నప్పటికీ పని దగ్గరకు వచ్చేసరికి షారుక్ కచ్చితమైన నిబంధనలను పాటిస్తున్నారని పేర్కొన్నారు.
`సెట్స్‌లో షారూఖ్ - సుహానా మధ్య ఉన్న కెమిస్ట్రీని ప్రశంసించారు. షారూఖ్ చాలా తెలివైన తండ్రి. ఆయన తన పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. సెట్స్‌లో సుహానాతో కలిసి రిహార్సల్స్ చేసేటప్పుడు ఒక సీనియర్ నటుడిలా సలహాలు ఇస్తారే తప్ప తండ్రిలా అధికారం చెలాయించరు. షూటింగ్ సమయంలో సుహానాకు ఇతర నటులతో సమానంగా గౌరవం , బాధ్యతలు ఉంటాయన్నారు. ఈ ప్రవర్తన సెట్స్‌లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు..
షారూఖ్ ఖాన్ సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మంది కొత్త నటీనటులను ప్రోత్సహించారు. తాజాగా కుమార్తె విషయంలో కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. సుహానాకు ఈ సినిమా ఒక గొప్ప అభ్యాసం కావాలని షారుక్ కోరుకుం టున్నారు.
సుహానా స్వయంకృషితో ఎదగాలని, తండ్రి ఇమేజ్ ఆమె నటనపై ప్రభావం చూపకూడదని జాగ్రత్త పడుతున్నారు. సుహానా కూడా తన తండ్రి నుంచి నటనలోని మెళకువలను నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా పని చేస్తోందని చిత్ర యూనిట్ చెబుతోంది. అలాగే సినిమాలో షారూఖ్ ఖాన్ పాత్ర గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో షారుక్ నెగటివ్ షేడ్స్ ఉన్న కిల్లర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా విభిన్నంగా ఉండబోతున్నాయి.
తన కుమార్తె వెండితెర అరంగేట్రం కోసం షారూఖ్ ఇలాంటి ఒక పవర్‌ఫుల్ సబ్జెక్టును ఎంచుకోవడం వెనుక సుహానాలోని నటిని ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు కనిపిస్తోంది. కేవలం నటన విషయంలోనే కాదు. క్రమశిక్షణ విషయంలోనూ షారూఖ్ చాలా కఠినంగా ఉంటారని తెలుస్తోంది. షూటింగ్ సమయాలను పాటించడం. సీన్ల కోసం ముందే సిద్ధమవ్వడం వంటి విషయాల్లో సుహానాకు ఎటువంటి మినహాయింపులు లేవు. ఒక స్టార్ కిడ్‌గా కాకుండా ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సుహానాకు ఒక చక్కని వేదిక.
షారూఖ్ వంటి దిగ్గజ నటుడితో కలిసి పని చేయడం వల్ల ఆమెకు నటనలో ఎంతో పరిణతి చెందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. షారూఖ్ ఖాన్ కుమార్తెకు వారసత్వాన్ని మాత్రమే కాకుండా పని పట్ల నిబద్ధతను కూడా నేర్పిస్తున్నారు. తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తూనే నటుడిగా ప్రొఫెషనలిజం చాటుకుంటున్నారు. `కింగ్` సినిమా కేవలం కమర్షియల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఒక తండ్రి తన కుమార్తెకు ఇస్తున్న అత్యుత్తమ కెరీర్ గైడెన్స్‌గా కూడా కనిపిస్తోంది. మరి ఈ తండ్రీకూతుళ్ల జోడీ వెండితెరపై ఏ మేర మెప్పిస్తారో చూడాలి.