ఛానెల్స్ లో కూడా శ్రీరెడ్డికి ఇబ్బందులేనట

Update: 2018-03-19 16:33 GMT
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు న్యూస్ ఛానెల్స్ లలో ఎక్కువగా కనిపిస్తోన్న శ్రీ రెడ్డి రోజు ఇంటర్వ్యూలతో టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఉహించని విషయాలని చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అవకాశాలు ఇవ్వకుండా తెలుగమ్మాయిలని అనగదొక్కేస్తున్నారని చెప్పిన శ్రీ రెడ్డి రీసెంట్ గా ఇచ్చిన మరో ఇంటర్వ్యూ లో న్యూస్ ఛానెల్స్ లో కూడా తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను గురించి చెప్పుకుంది.

న్యూస్ ఛానెల్స్ లో వర్క్ చేసి తరువాత బయటకి వచ్చినప్పుడు అవకాశాలు ఎక్కువగా రాలేదు. అయితే మళ్లీ న్యూస్ ఛానెల్ వైపు అడుగులు వేసినప్పుడు నన్ను ఎక్కువగా పట్టించుకోలేదు. మావి డీసెంట్ న్యూస్ ఛానెల్స్. నువ్ ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసి వచ్చావు ఇక్కడ కుదరదు అన్నప్పుడు చాలా బాధగా ఆనిపించిందని చెబుతూ.. ఇక్కడ వీరు అవకాశాలు ఇవ్వడం లేదు అక్కడ వాళ్లు కూడా అవకాశం ఇవ్వడం లేదని శ్రీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక హీరోయిన్ గా ప్రయత్నాలు చేయమని చెప్పినప్పుడు కేవలం ఎక్స్ పొజిగ్ మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు అనే విషయం గురించి మాట్లాడుతూ.. నేను ముందుగానే ఎక్స్ పోజింగ్ చేయలేదు. ఇతర పరిస్థితులు కావచ్చు లేదా నా ఆకలి బాధ కావచ్చు.. ఇలా అనేక కారణాల వల్ల ఎదో పరిస్థితుల ప్రభావం వలన తెలియకుండా జరిగిపోయిందని ఆమె తెలిపింది.


Tags:    

Similar News