యంగ్ హీరో కోసం శ్రీరెడ్డి ఆవేదన.. నీకేం తెలుసంటూ ఫ్యాన్స్ కౌంటర్
శ్రీరెడ్డి ఈమద్య కాస్త సైలెంట్ గా ఉంటుందని.. టాలీవుడ్ స్టార్స్ పై హాట్ కామెంట్స్ ను తగ్గించిందని అనుకుంటున్నామో లేదో అప్పుడే మెగా హీరోలపై విరుచుకు పడింది. ఇటీవలే యూట్యూబ్ లో వంటలు చేసుకుంటూ శ్రీరెడ్డి బిజీ అయ్యిందని దాంతో టాలీవుడ్ స్టార్స్ కాస్త రిలాక్స్ గా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ చూసిందో లేక మరేంటో కాని హీరో నాగశౌర్య విషయం లో ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో 'నాగశౌర్య లాంటి ట్యాలెంటెడ్ మరియు హ్యాండ్సమ్ హీరోస్ ని తొక్కేయకండ్రా తొక్కలో మెగా హీరోస్ కోసమ్' అటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి ప్రతి పోస్ట్ కు బ్యాడ్ కామెంట్స్ చాలా కామన్ గా వస్తూనే ఉంటాయి. ఇక ఈ పోస్ట్ కు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతరులు కూడా శ్రీరెడ్డి లేవనెత్తిన విషయంపై స్పందించారు.
శ్రీరెడ్డి వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ నాగశౌర్య సొంత బ్యానర్ లో సినిమాలు చేసుకునే సత్తా ఉన్న హీరో. ఒకరి కోసం ఇంకో హీరోను తొక్కేయడం అనేది సాధ్యం కాని విషయం. నీవు కనీస అవగాహణ లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు. వరుసగా ఫ్లాప్ లు వస్తున్నా కూడా ఆయన హీరోగా సొంత బ్యానర్ లో చేస్తున్నారు. నాగ శౌర్యకు ప్రతి సినిమా సమయంలో కూడా చిరంజీవి గారు ఆశీర్వదించి సినిమా హిట్ అవ్వాలంటూ కోరుకుంటున్నారు.
ఇటీవలే నాగశౌర్య సోషల్ మీడియా ద్వారా చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పిన విషయం నీకు తెలియదా అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏమీ తెలియకుండానే మెగా హీరోలను టార్గెట్ చేయడం నీకు ఫ్యాషన్ అయ్యింది. పాపులారిటీ కోసం నీవు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటికైనా ఆపేయమంటూ పలువురు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.