స్రవంతి మూవీస్ లో స్రవంతి ఎవరు?

Update: 2015-10-04 19:30 GMT
ఓ నిర్మాత ఓ బేనర్ మొదలు పెట్టాలనుకున్నపుడు దానికి సాధ్యమైనంత వరకు తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు పెట్టాలనుకుంటాడు. ఇంకొందరు ఇలాంటి వ్యక్తుల పేర్లు కాకుండా ‘సినిమా’ టచ్ ఉండేలా ఏదైనా క్రియేటివ్ పేర్లు పెడతారు. ఇంకొందరు దేవుడి పేరు మీద బేనర్ మొదలుపెడతారు. ఐతే స్రవంతి మూవీస్ సంస్థది వీటన్నింటికీ భిన్నమైన దారి. ఆ స్రవంతి అనేది రవికిషోర్ కూతురి పేరేమీ కాదు. అది ఓ నవలలోని పాత్ర పేరట. ఆ సంగతి రవికిషోరే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్రవంతి మూవీస్ బేనర్ పెట్టి 30 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పేరు గురించి.. తన సంస్థ ప్రస్థానం గురించి ఆయనేమన్నారంటే...

‘‘ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్న నేను కొందరు మిత్రులతో కలిసి సినిమా తీద్దామనుకున్నా. వంశీ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సినిమా తీయడానికి ప్రయత్నించాం. కథ రెడీ చేసుకుని కమల్ ను సంప్రదించాం. కానీ కొత్తవాళ్లమని ఆయన వెనుకంజ వేశారు. ఆ తర్వాత వంశీ ‘ఆలాపన’ సినిమా చేస్తుండగా కలిశాం. భరణితో కలిసి కథ ‘లేడీస్ టైలర్’ తయారు చేశాం. ఇళయరాజాకు అడ్వాన్స్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఆ రోజుల్లో నేను మల్లాది, యండమూరి రచనలు బాగా చదివాను. మల్లాది నవలల్లో ‘స్రవంతి’ ఒకటి. ఆ నవలలో కథానాయిక పాత్ర నాకు బాగా నచ్చింది. పేరు కూడా బావుందని ఆ పేరే బేనర్ కు పెట్టేశాను. ఇప్పుడా పేరు నా ఇంటి పేరు అయిపోయింది. నా సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకుందంటే దానికి కారణం లేడీస్ టైలరే’’ అని చెప్పారు రవికిషోర్.
Tags:    

Similar News