‘స్పైడర్’ ఇప్పుడిప్పుడే ఉండదట..

Update: 2017-04-23 09:22 GMT
మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ ఓకే అయి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి కూడా దాదాపు పది నెలలవుతోంది. భారీ బడ్జెట్ మూవీస్ కూడా ఆరు నెలల్లో పూర్తయిపోతున్న ఈ రోజుల్లో మహేష్ సినిమా మొదలైన ఏడాదికి కూడా విడుదలయ్యేలా కనిపించట్లేదు. జూన్ 23న థియేటర్లలో కలుద్దామంటూ కొన్ని నెలల కిందట మురుగదాస్ చేసిన ప్రకటనతో మహేష్ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంలో ఆలస్యం చేసినా.. వాయిదాల మీద వాయిదాలు వేసినా సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు సినిమా కూడా అనుకున్న సమయానికి రావట్లేదు. జూన్ 23 నుంచి ఈ సినిమా వాయిదా పడటం పక్కా అని.. అదే తేదీకి ‘దువ్వాడ జగన్నాథం’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో స్పష్టమైపోయింది.

జూన్ 23న కాకపోయినా.. రెండు మూడు వారాలు లేటుగా.. అంటే జులైలో అయినా సినిమా వచ్చేస్తుందిలే అని మహేష్ అభిమానులు ఆశతో ఉండగా.. అలాంటిదేమీ లేదని చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ చిత్రం జులైలో విడుదలయ్యే అవకాశమే లేదని అంటున్నారు. జులైకి సినిమా రెడీ అయ్యే అవకాశముంటే.. కొంచెం కష్టపడి అనుకున్నట్లుగా జూన్ 23కే సినిమాను సిద్ధం చేయగలిగేవాళ్లు. వీఎఫెక్స్ తదితర పనులకు కొంచెం ఎక్కువ సమయమే పట్టేట్లుండటంతో ఇప్పుడే ఫలానా డేట్ అంటూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. తమిళంలో పెద్ద సినిమాల రిలీజ్‌ ను కూడా దృష్టిలో పెట్టుకుని తదుపరి తేదీని ఫిక్స్ చేయాల్సి ఉంది. జులై దాటిపోయాక కనిపిస్తున్న మంచి తేదీ ఆగస్టు 11. కానీ ఆ తేదీకి విక్రమ్ మూవీ ‘ధృవ నక్షత్రం’ డేట్ ఫిక్స్ చేసుకుంది కాబట్టి.. ఈ రోజు రిలీజ్ చేయడానికి అవకాశం లేనట్లే. ఇక తర్వాతి పాజిబుల్ డేట్ అంటే.. ఆగస్టు 25. వినాయకచవితి వీకెండ్ డేట్ కాబట్టి ఇదే ఖరారు కావచ్చని అంటున్నారు. అదే ఖాయమైతే మహేష్ ఫ్యాన్స్ ఇంకా నాలుగు నెలలు ‘స్పైడర్’ కోసం ఎదురు చూడాలన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News