ప్రభుత్వ లాంచనాలతో వీరశైవ జంగమ సాంప్రదాయంలో బాలు అంత్యక్రియలు

Update: 2020-09-26 07:50 GMT
తన గాత్రంతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా యావత్‌ భారతదేశ ప్రజలను అలరిస్తూ వస్తున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి సినీ జగత్తుకు తీరని లోటు. నిన్న మద్యాహ్నం సమయంలో మృతి చెందిన ఆయన అంత్య క్రియలు నేడు ఉదయం తమిళనాడులోని తారమరైపాక్కం ఫామ్‌ హౌస్ లో జరిగాయి. కరోనా కారణంగా ఎక్కువ సమయం ఆయన మృత దేహంను సందర్శకుల సందర్శనార్థం ఉంచలేదు. తమిళనాడు ప్రభుత్వ లాంచనాలతో వీరశైవ జంగమ సాంప్రదాయంలో బాలు గారి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

ప్రభుత్వంకు చెందిన కొందరు ప్రముఖులు మరియు బాలు గారి కుటుంబ ఆప్తులు మరియు సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం నుండి బాలు గారికి గౌరవ వందనం సమర్పించి గౌరవ సూచకంగా తుపాకులు కాల్చి ప్రభుత్వం నివాళ్లు అర్పించింది. వీర శైవ జంగమ సాంప్రదాయం ప్రకారం బాలు గారిని కూర్చున్న పొజీషన్‌ లో ఖననం చేయడం జరిగింది. తనకు ఎంతో ఇష్టమైన ఫామ్‌ హౌస్ లో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆయన జ్ఞాపకార్థం ఫామ్‌ హౌస్‌ లో ఒక సమాధిని కూడా కుటుంబ సభ్యులు నిర్మించనున్నారట. తారమరైపాక్కం పరిసర ప్రాంతాలకు భారీ ఎత్తున బాలు అభిమానులు చేరుకున్నారు. కాని పోలీసు ఆంక్షలు ఉన్న కారణంగా ఫామ్‌ హౌస్‌ వద్దకు వారిని అనుమతించలేదు.
Tags:    

Similar News