అల్లుడుతో కలవబోతున్న సోనూసూద్‌

Update: 2020-09-28 04:30 GMT
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నభా నటేష్‌ మరియు అను ఎమాన్యూల్‌ లు హీరోయిన్స్‌ గా రూపొందుతున్న 'అల్లుడు అదుర్స్‌' సినిమా షూటింగ్‌ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు ఆరు నెలలుగా షూటింగ్‌ కు వెళ్లని ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు ఇటీవలే మళ్లీ షూటింగ్‌ ను మొదలు పెట్టారట. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న సోనూసూద్‌ వచ్చే వారం నుండి షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.

గత ఏడాది సీత సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి సోనూసూద్‌ నటించాడు. ఆ సినిమాలో ఇద్దరి కాంబోకు మంచి ఆధరణ లభించింది. ఇద్దరు కూడా పోటీ పడి నటించినట్లుగా అనిపించింది. అందుకే తప్పకుండా వీరిద్దరి కాంబోలో రాబోతున్న అల్లుడు అదుర్స్‌ మూవీ కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. వచ్చే వారం నుండి షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యి సింగిల్‌ షెడ్యూల్‌ లో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.

కోవిడ్‌ సమయంలో రియల్‌ హీరో అయిన సోనూసూద్‌ ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాకు మంచి హైప్‌ దక్కుతుందని మీడియా సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి సోనూసూద్‌ మరియు బెల్లంకొండల ఫైట్‌ తో నిజంగానే అల్లుడు అదుర్స్‌ అనిపించుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News