జాక్వెలిన్ తో సోను సూద్ సరికొత్త ప్లాన్
హిందీ, తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూ సూద్. లాక్ డౌన్ టైంలో వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలబడి ఈ రీల్ లైఫ్ విలన్ కాస్తా రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు. సోనూసూద్‌ను ఇక సిల్వర్ స్క్రీన్‌పై విలన్‌గా చూసేందుకు ఇష్టపడనంతలా జనాలు మారిపోయారంటే ఈ టాలెంటెడ్ యాక్టర్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా సోనూసూద్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం ఫతేహ్. భారీ బడ్జెట్ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో శ్రీలంకన్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. హై ఆక్టేన్-యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌గా ఈ చిత్రం రాబోతుంది. ఇక ఈ చిత్ర నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అధికారికంగా ప్రకటించారు.
గత డిసెంబర్ లో సోనూసూద్ ఫతేహ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ... ఈ రోజు అది కార్య రూపం దాల్చింది. సోనూసూద్ ట్విటర్ లో నా తదుపరి మిషన్ ఫతేహ్ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లు ఆయన తెలిపారు. సోనూ సూద్ సరసన జాక్వెలిన్ నటిస్తుండగా.... ఇద్దరూ క్లాప్ బోర్డు ఉన్న ఫోటోను ప్రారంభ సూచికగా తెలిపారు. ఇందులో పాత్ర కోసం సోనూసూద్ బాడీని తగిన విధంగా మార్చుకున్నట్లు ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ మూవీని ఢిల్లీ, పంజాబ్‌లోని లొకేషన్లలో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
వైభవ్ మిశ్రా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఆయనే ఈ సినిమాకి రచయితగా ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్- శక్తిసాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇందులో భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తి వివరాలు తెలియజేయనుంది సోనూసూద్ టీం. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నాడు సోనూ సూద్, రాజకీయ రంగప్రవేశం అంటూ వార్తలు వచ్చినా అవేమీ నిజం కాలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.