• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విలన్ గా 'బృందావన్ కాలనీ'...

విలన్ గా 'బృందావన్ కాలనీ' బేబీ

By - Tupaki Desk
Update: 2018-08-24 14:30 GMT
ఒకప్పటి హీరోయిన్స్ ఇప్పటి న్యూజెన్ మూవీస్ లో తల్లిగానో - అత్తగానో - వదినగానో - అక్కగానో రావడానికి అసలేమాత్రం ఇష్టపడడంలేదు. అలాంటి పాత్రలు పోషిస్తే.. తమ గ్లామర్ కు భంగమని ఫీలవడమో లేక నామోషీగా భావించడమో తెలియదు కానీ..కొంచెం పవర్ ఫుల్ పాత్రలనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో  '7/G బృందావన్ కోలనీ' చిత్రంతో సౌత్ లో మంచి మార్కులేయించుకున్న అందాల భామ సోనియా అగర్వాల్ ఇప్పుడో తమిళ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

'నీ ప్రేమకై' తెలుగు చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినా .. హీరోయిన్ గా తమిళ చిత్రసీమలోనే స్థిరపడింది ఈ పంజాబీ బ్యూటీ.  ధనుష్ అన్న సెల్వరాఘవన్ ను ప్రేమించి పెళ్ళిచేసుకొని.. ఆ తర్వాత అతడితో తెగదెంపులు చేసుకున్న ఈ సుందరి.. ప్రస్తుతం పలు మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. మొన్నటికి మొన్న తెలుగులో 'టెంపర్' - నిన్నొచ్చిన 'విన్నర్' చిత్రాల్లో ప్రాధాన్యం కలిగిన పాత్రల్నే పోషించిన సోనియా..తాజాగా 'ఉన్నాల్ ఎన్నాల్' అనే తమిళ సినిమాతో విలన్ గా మారనుంది. తమిళ దర్శకుడు జయకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందట. విలాసాలకు అలవాటు పడిన ఒక స్త్రీ .. తను పనిచేసే కంపెనీ బాస్ నే చంపడానికి స్కెచ్ గీస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమెకు ఓ ఇద్దరు యువకులు అండగా నిలబడతారు. చివరికి ఆ స్త్రీ తన బాస్ ను చంపగలిగిందా లేదా అన్నదే మిగతా కథ. ఇప్పటివరకూ సోనియా అగర్వాల్ సాఫ్ట్ రోల్సే ప్లే చేసింది. అయితే ఈ సినిమాతో ఆమెలోని మరో కోణాన్ని చూస్తారని దర్శకుడు అంటున్నాడు. ఇక ఈ సినిమాలో సోనియా విలన్ గా నటించడానికి కాస్తంత గట్టిగానే పారితోషికం అందుకుంటోందట. మరి ఈ సినిమాతో సోనియా విలనీ ఏ స్థాయిలో రక్తికడుతుందో చూడాలి.
Tags:    
  • Sonia Agarwal 
  • Unnal Ennal Movie 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS