• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న‌ట‌వార‌సురాలికి మ‌రోసారి...

న‌ట‌వార‌సురాలికి మ‌రోసారి లిఫ్టిచ్చాడు

By - Tupaki Desk
Update: 2019-09-09 01:30 GMT
నాన్న కూచీలు మ‌డిక‌ట్టుకుని కూర్చుంటే ఫ‌లితం ఇలానే ఉంటుంద‌ని అర్థ‌మైన‌ట్టుంది.. షాట్ గ‌న్ సోనాక్షి సిన్హా వార‌సురాలు సోనాక్షి సిన్హా.. ప‌ట్టు విడుపు ప్ర‌ద‌ర్శించ‌బోతోంద‌ట‌. గ‌త కొంత‌కాలంగా ఈ న‌ట‌వార‌సురాలికి  అవ‌కాశాలు త‌గ్గ‌డంతో తిరిగి గ్లామ‌ర్ రూట్ లోకి రాబోతోంద‌ట‌. ఈసారి కూడా ఆప‌ద్భాంద‌వుడు స‌ల్మాన్ ఖాన్ నే దిక్క‌య్యాడు.

ఇంత‌కుముందు సోనాక్షికి ద‌బాంగ్ లాంటి క్రేజీ ఫ్రాంఛైజీలో ఛాన్సిచ్చి లైఫిచ్చాడు. ఇప్పుడు మ‌రోసారి లిప్టిచ్చే బాధ్య‌త‌ని తీసుకున్నాడు. `ద‌బాంగ్‌` చిత్రంతో సోనాక్షిని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసిన ఆయ‌నే  కెరీర్ రిస్క్‌లో వుంద‌ని గ్ర‌హించి మ‌రో అవ‌కాశం ఇచ్చారు. సంజ‌య్ లీలా భ‌స్సాలీతో అనుకున్న `ఇన్ షాల్లా` ఆగిపోవ‌డంతో త‌ను న‌టిస్తూ త‌న సోద‌రుడు నిర్మిస్తున్న `ద‌బాంగ్‌-3`ని వేగంగా పూర్తి చేసేందుకు రెడీ అయ్యాడు.

ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సోనాక్షీసిన్హా హీరోయిన్‌గా న‌టిస్తోంది.  ఈ ఏడాది ఈద్‌(డిసెంబ‌ర్‌)కు తిరిగి అభిమానుల ముందుకు రావాల‌నుకున్నా.. రిలీజ్‌ని వ‌చ్చే ఏడాది ఈద్‌కు వాయిదా వేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ ప్ర‌చారాన్ని కొట్టిప‌డేస్తూ సోనాక్షి సిన్హా రిలీజ్ పై ప‌క్కా క్లారిటీ ఇచ్చేసింది. ముందు ప్ర‌క‌టించిన విధంగానే `ద‌బాంగ్‌-3` ఈ ఏడాది ఈద్ కు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంద‌ని తేల్చి చెప్పేసింది. ప్ర‌భుదేవాతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం చాలా ఎంజాయ్ చేస్తాన‌ని.. ఆయ‌న త‌ర‌హా మేకింగ్ అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తాన‌ని.. `ద‌బాంగ్‌`తో ప‌రిచ‌య‌మైన నాకు మ‌ళ్లీ అలాంటి ఫీలింగ్‌నే ఈ సినిమా క‌లిగిస్తోంద‌ని చెప్పింది. సోనాక్షి అభిమానులు మాత్రం త‌న‌కు ఈ సినిమా కెరీర్ ప‌రంగా పెద్ద బూస్ట్ అవుతుంద‌ని భావిస్తున్నారు.


Tags:    
  • Sonakshi Sinha 
  • Dabangg 3 
  • Salman Khan 
  • December 2019 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS