• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గాడ్ ఫాదర్' కు 'సన్ ఆఫ్...

'గాడ్ ఫాదర్' కు 'సన్ ఆఫ్ ఇండియా' బర్త్ డే విషెస్..!

By - Tupaki Desk
Update: 2021-03-19 08:15 GMT
విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రస్తుతం ''సన్ ఆఫ్ ఇండియా'' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన ఇదివ‌ర‌కెన్న‌డూ పోషించని అత్యంత ప‌వ‌ర్‌ ఫుల్ రోల్‌ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మోహన్ బాబు లుక్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే నేడు మోహన్ బాబు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో 'సన్ ఆఫ్ ఇండియా' టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ వదిలింది.

జాతీయ జెండాలోని మూడు రంగులు బ్యాగ్రౌండ్ లో కనిపిస్తుండగా.. మోహన్ బాబు మెడలో రుద్రాక్ష ధరించి సీరియస్ గా చూస్తున్నాడు. 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మోహ‌న్‌ బాబు స్క్రీన్‌ ప్లే స‌మ‌కూరుస్తున్నారు. ఈ చిత్రంలో మోహ‌న్‌ బాబుకు స్టైలిస్ట్‌ గా ఆయ‌న కోడ‌లు విరానికా మంచు వర్క్ చేస్తున్నారు. మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు సమకూరుస్తున్నారు. స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Tags:    
  • mohan babu 
  • Son of India 
  • happy birthday mohan babu 
  • mohan babu new movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS