• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెన్సార్ కంప్లీట్...

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న 'సోలో బ్రతుకే సో బెటర్'...!

By - Tupaki Desk
Update: 2020-10-21 15:30 GMT
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించాడు. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కి వెళ్ళింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా, టైటిల్ కి తగ్గట్టే పెళ్లి అంటే ఇష్టంలేని.. సోలోగా ఉండటమే బెటర్ అని అనుకునే యువకుడి కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో తేజ్ కి జోడీగా నభా నటేష్ నటించింది.

ఇప్పటికే 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ మరియు 'నో పెళ్లి' వీడియో సాంగ్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన 'హే ఇది నేనేనా..' సాంగ్ మరియు 'అమృత' అనే బ్రేకప్ సాంగ్ కూడా సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. వెంకట్ సి దిలీప్ కెమెరామెన్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. 'చిత్రలహరి' 'ప్రతీరోజూ పండగే' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూవీతో మెగా మేనల్లుడు తన విజయాల పరంపర కొనసాగిస్తాడేమో చూడాలి.
Tags:    
  • Solo Bratuke So Better 
  • Sai Dharam tej 
  • Censor 
  • Clean U 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS