• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రాధేశ్యామ్' నుంచి...

'రాధేశ్యామ్' నుంచి హృదయాన్ని తాకే సోల్ ఫుల్ మెలోడీ..!

By - Tupaki Desk
Update: 2021-12-08 09:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పుజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ ఈ పీరియాడికల్ లవ్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'రాధేశ్యామ్‌' మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్‌ పెంచారు. ప్రచార కార్యక్రమాల్లో నిన్న మొన్నటి వరకు కాస్త నిదానంగా ఉన్న చిత్ర బృందం.. ఒక్కసారిగా వేగంపెంచి సినిమాపై భారీ హైప్ తీసుకొస్తున్నారు. నాలుగు దక్షిణాది భాషలకు మరియు హిందీ వెర్సన్ కు వేర్వేరుగా ప్రమోషన్స్ చేస్తుండటం గమనార్హం.

హిందీ వెర్సన్ నుంచి 'వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్' పేరుతో ఇప్పటికే విడుదలైన 'ఆషికీ ఆ గయీ' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో 'రాధే శ్యామ్' నుంచి ''సోచ్ లియా'' అనే మరో సాంగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఎమోషనల్ మూడ్ లో సాగిన ఈ పాట హృదయానికి హత్తుకుంటోంది.

ప్రేరణ ప్రేమ కోసం విక్రమాదిత్య వెంటపడటం.. ఆమె అతనికి దూరంగా వెళుతుండటం.. ప్రేమలో పడిన తర్వాత ఇద్దరూ దూరం అవ్వడం.. ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ ఉండటం.. ఒకరి ప్రేమ కోసం ఒకరు తపిస్తూ ఉండటం వంటి సన్నివేశాలను 'సోచ్ లియా' పాటలో చూడొచ్చు.

వింటేజ్ లుక్ లో ప్రభాస్ - పూజాహెగ్డే జంట స్క్రీన్ మీద ఫ్రెష్ గా కనిపిస్తోంది. 1970 కాలానికి తగ్గట్టుగా ఉన్న లొకేషన్స్ - విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటిఫుల్ సోల్ ఫుల్ మెలోడీకి మిథున్‌ ట్యూన్ కంపోజ్ చేశారు. మనోజ్‌ మింతాసిర్‌ సాహిత్యం అందించగా.. అర్జిత్‌ సింగ్‌ అద్భుతంగా ఆలపించారు.

గుల్షన్ కుమార్ - టీ సిరీస్ సమర్పణలో యువీ క్రియేషన్స్‌ తో కలసి భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కమల్‌ కన్నన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేయగా.. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు. దక్షిణాది భాషలకు జస్టిస్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు.




Full View
Tags:    
  • Radhe Shyam 
  • Soch Liya 
  • Prabhas 
  • Pooja Hegde 
  • Om Raut 
  • Kriti Sanon 
  • Deepika Padukone 
  • Radhe Shyam update 
  • Radhe Shyam new song 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS