'బాహుబలి బలిదానం నచ్చలేదు'

Update: 2015-07-14 16:27 GMT
మనసులో ఉన్న మాట చెప్పడానికి మొహమాటం ఎందుకు? ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారో? ఎవరైనా నొచ్చుకుంటారేమో! ఇలాంటి సంశయాలేవీ పెట్టుకోలేదు ఈ క్యూట్‌ హీరోయిన్‌. మనసుకు ఏం తోచిందో అది నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడేసింది. అంతేనా సాక్షాత్తూ ఎస్‌.ఎస్‌.రాజమౌళి అంతటి దర్శకుడినే వేలెత్తి చూపించింది. ఫలానా సన్నివేశంలో హత్య చేయించావు.. అది తప్పు అని నిలదీసింది.

అసలింతటి ఇంతటి ధీరత్వం ప్రదర్శించిన ఆ కథానాయిక ఎవరు.. అవును ఈ భామ స్నేహాఉల్లాల్‌. అప్పట్లో బాలయ్య సరసన 'సింహా' చిత్రంలో నటించింది. ఆ తర్వాత నడుము పట్టేయడం వల్ల తెలుగు పరిశ్రమకు దూరమైంది. ఇన్నాళ్టికి మళ్లీ టచ్‌లోకి రావాలనిపించిందో ఏమో ఇప్పుడో కామెంట్‌ విసిరి అందరి అటెన్షన్‌ని తనవైపే తిప్పేసుకుంది. బాహుబలి విషయంలో నాకు ఓ విషయం అస్సలు నచ్చలేదు. యుద్ధానికి వెళ్లే ముందు దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఓ మూగ జీవాన్ని బలి తీసుకోవడం చూపించారు. అది అస్సలు నచ్చలేదు. అంటూ కలరింగ్‌ ఇచ్చింది.

''కల్చర్‌లో అలాంటిది ఉన్నా.. దానిని తెరపై పబ్లిక్‌కి చూపించడం అస్సలు బాలేదు. భళ్లాలదేవుడు ఆ దున్నపోతుని నరికేయడం నచ్చలేదు..'' అంటూ నిరభ్యంతరంగా తన అభ్యంతరాన్ని చెప్పింది. విన్నారా జక్కన్న గారూ.. బాహుబలి-2లో ఓ అవకాశం ఇస్తారా? బోలెడన్ని సూచనలిస్తుంది ఫ్రీగా..!
Tags:    

Similar News