చెత్త సినిమాలు చూశానన్న కొత్త ప్రెసిడెంట్

Update: 2017-03-08 18:08 GMT
యాక్టర్ శివాజీ రాజా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడుగా శివాజీ రాజా ఎంపికయ్యాడు. సినిమా ఇండస్ట్రీలోని పలు రంగాల్లో అపార అనుభవం ఉన్న ఈయన.. గతంలో సెన్సార్ బోర్డ్ మెంబర్ గా కూడా పని చేశాడు. అప్పటి అనుభవాలను పంచుకుంటూ కొన్ని సార్లు చెత్త సినిమాలు కూడా చూడాల్సిన పరిస్థితి గురించి గుర్తు చేసుకున్నాడు.

'ఇదంతా డిజిటల్ యుగం. ఫిలిం మేకింగ్ లో కూడా డిజిటల్ రంగం ప్రవేశించి చాలా కాలమైంది. కొంతమంది ఔత్సాహికులు కేవలం సెల్ ఫోన్లతోనే సినిమాలు తీసేస్తున్నారు. మరికొందరు చవగ్గా వచ్చే కెమేరాలతో లాగించేస్తున్నారు. వాటిలో కనీస మాత్రం కథ కూడా ఉండదు. నటీనటుల సంగతి అసలు చెప్పనక్కర్లేదు. వాటిని సెన్సార్ చేయాల్సి వచ్చినపుడు.. బోర్డ్ మెంబర్ గా మేమేం చేయలేం. ఒకరి మొహాలు ఒకళ్లు చూసుకుంటూ ఉంటామంతే. కొన్ని సినిమాలు అంత దారుణంగా ఉంటాయి' అని చెప్పాడు మా కొత్త అధ్యక్షుడు.

ఔత్సాహికులు సినిమాలు తీయాలనుకోవడం తప్పులేదని.. మేకింగ్ లో నాణ్యత లేనపుడు.. కంటెంట్ లో అయినా దమ్ము ఉండేలా చూసుకోవాలన్న శివాజీ రాజా.. ఇతర పరిశ్రమలకు టాలీవుడ్ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించాండు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News