• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్-అనిరుధ్.. తమిళ హీరో...

పవన్-అనిరుధ్.. తమిళ హీరో ఎగ్జైట్మెంట్

By - Tupaki Desk
Update: 2016-11-06 07:01 GMT
చాలా తక్కువ టైంలో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు తమిళ కుర్రాడు అనిరుధ్. అతను ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్టే. అదిరిపోయే పాటలు ఇవ్వడమే కాదు.. గూస్ బంప్స్ ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలోనూ అనిరుధ్ ప్రత్యేకత కనిపిస్తుంది. వీఐపీ.. కత్తి.. వేదాళం లాంటి సినిమాల్లో అతడి ఆర్.ఆర్.కు చాలా ప్రశంసలు దక్కాయి. మాస్ ఫ్యాన్స్ అతడి నేపథ్య సంగీతానికి పిచ్చెక్కిపోతుంటారు.

ఇప్పుడు అనిరుధ్.. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతాన్నందించబోతున్నాడు. మరి పవన్ సినిమాకు అతను ఎలాంటి పాటలిస్తాడు.. ఎలాంటి ఆర్.ఆర్ చేస్తాడు అన్న ఆసక్తి జనాల్లో మొదలైంది. ఐతే ఈ విషయంలో మన అభిమానుల కంటే కూడా ఓ ప్రముఖ తమిళ హీరో బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. వరుస హిట్లతో ఊపుమీదున్న శివ కార్తికేయన్. అతను వరుసగా అనిరుధ్ తోనే పని చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే.

పవన్-అనిరుధ్ కాంబినేషన్ గురించి అతను స్పందిస్తూ.. ‘‘పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. చెన్నైలో ఆయన సినిమాలు తొలి రెండు మూడు రోజుల్లో చూసేస్తుంటా. గబ్బర్ సింగ్ సినిమా థియేటర్లో చూస్తుంటే వాతావరణం మామూలుగా లేదు. లోపల జనాల్లో ఒకరకమైన ఫైర్ కనిపించింది. ఆ ఉత్సాహం చూసి ఆశ్చర్యపోయా. పవన్ గారి తర్వాతి సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది. పవన్ సార్ ఇంట్రడక్షన్ సీన్ కు అనిరుధ్ తన స్టయిల్లో బీజీఎం ఇస్తే ఎలా ఉంటుందా అని ఉత్కంఠగా ఉంది’’ అని శివ కార్తికేయన్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Siva Karthikeyan 
  • Anirudh 
  • Pawan 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS