#లేజీ సండే.. సీతా పాప కొట్లాడేది అన్నతోనేనా..?
ఇటీవలే దుబాయ్ ట్రిప్ లో అన్న గౌతమ్ తో కలిసి సితార సాహసాల గురించి తెలిసిందే. డాడీ మహేష్ ఓవైపు షూటింగుల్లో బిజీగా ఉంటే.. ఆయనను డిస్ట్రబ్ చేయకుండా.. అక్కడ విహార యాత్రను ఆస్వాధించారు. ఎడారిలో స్పెషల్ అడ్వెంచర్ రైడ్ కి వెళ్లారు అన్నా చెల్లెళ్లు. అలాగే అక్కడ వాటర్ స్పోర్ట్స్ డైవింగులకు వెళ్లారు. బ్లూ సీలో మరబోట్ పైనా రైడింగ్ కి వెళ్లి ఆశ్చర్యపరిచారు.
దుబాయ్ ట్రిప్ లో స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి. అలాగే ఇటీవల త్రోబ్యాక్ ఫోటోల్ని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాల్లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు హైదరాబాద్ లోనే మహేష్ అండ్ సితార ఫ్యామిలీ ఉన్నారు.
తాజాగా లేజీ సండే ..! అంటూ నమ్రత షేర్ చేసిన మరో ఫోటోగ్రాఫ్ వైరల్ గా మారింది. ఈ ఫోటోలో సీతా పాప ఏకంగా కొట్లాటకే దిగినట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆ కొట్లాట ఎవరితో..? అన్న గౌతమ్ తోనేనా...? ప్చ్.. ! అది ఎవరు? అంటూ ఫ్యాన్స్ డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.
చూస్తుంటే కాస్త మహేష్ గెటప్ కనిపిస్తున్నా కానీ.. అబ్బే స్కూల్ కుర్రాడు అయ్యుంటారు! అని సందేహిస్తున్నారు. బహుశా సర్కార్ వారి పాట కోసం మహేష్ ఇలా స్లిమ్మవ్వడంతో అతడినే గౌతమ్ అనుకునే ప్రమాదం కనిపిస్తోంది. అతడు మరీ స్టూడెంట్ లా మారిపోయి టీనేజర్ నే తలపిస్తుంటే దానికి ఖంగు తినడం అభిమానుల వంతైంది.