• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ మూవీలో మహేశ్ బాబు...

విజయ్ మూవీలో మహేశ్ బాబు కూతురు సితార?

By - Tupaki Desk
Update: 2021-10-06 10:30 GMT
తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి .. మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే అక్కడ ఓ పండగ జరుగుతున్నట్టుగానే ఉంటుంది. ప్రతి థియేటర్ దగ్గర జాతర వాతావరణమే కనిపిస్తుంది. ఆయన సినిమాలు ఫస్టులుక్ నుంచి మొదలుపెడితే, ఫస్టు వీక్ వసూళ్ల వరకూ కొత్త రికార్డులను కొల్ల గొడుతూనే ఉంటాయి. అలాంటి విజయ్ కమల్ .. రజనీ మాదిరిగా మొదటి నుంచి తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టలేదు. ఈ మధ్యనే 'విజిల్' .. 'మాస్టర్' వంటి సినిమాలు ఇక్కడ భారీస్థాయిలో విడుదలయ్యాయి.

ఇక తెలుగులో కూడా తన మార్కెట్ ను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడని తెలుస్తోంది. తెలుగు సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాను పట్టాలెక్కేంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో 9 ..10 ఏళ్ల పాప పాత్ర ఉందట. ఆ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. అలాంటి ఈ పాత్రను మహేశ్ బాబు కూతురు 'సితార'తో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వంశీ పైడిపల్లి ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాతో సితారను బాలనటిగా పరిచయం చేయడానికి ఆయన ఉత్సాహపడుతున్నాడని చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన మహేశ్ ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.

వంశీ పైడిపల్లి .. మహేశ్ బాబు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందువలన మహేశ్ బాబును ఒప్పించడంలో ఆయన సక్సెస్ కావొచ్చని అంటున్నారు. ఒక వైపున అల్లు అర్జున్ కూతురు 'అర్హ' 'శాకుంతలం'  సినిమాతో పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ సినిమా 'తెరి' ద్వారానే మీనా కూతురు కూడా బాలనటిగా పరిచయమైంది. ఆ సినిమా ఆ పాపకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక సితార చూస్తే మొదటి నుంచి కూడా తను చాలా యాక్టివ్. అందువలన ఈ సినిమాతో సితార ఎంట్రీ జరిగే అవకాశమైతే కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో అలాంటి పాత్ర ఒకటి ఉందా? లేదా? అనే విషయంలోనే క్లారిటీ రావలసి ఉంది.

ప్రస్తుతం విజయ్ 'బీస్ట్' సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న  ఈ సినిమాలో ఆయన జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ ఈ సినిమా షూటింగు పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి  ప్రాజెక్టు పైకి వచ్చేస్తాడని అంటున్నారు. తెలుగులో మొదటిసారిగా విజయ్ చేస్తున్న ఈ సినిమాలో, మరెన్ని విశేషాలు చోటు చేసుకుంటాయో చూడాలి. సితారా నిజంగానే యాక్ట్ చేయనుందా? అనేది తెలియాలి.
Tags:    
  • sitara 
  • Vamsi paidpally 
  • Vamsi paidpally movies 
  • Vamsi paidpally vijay movie 
  • vijay 66 
  • Dilraju 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS