• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్ర‌గ్స్ కేసులో పూరీ,...

డ్ర‌గ్స్ కేసులో పూరీ, ర‌వితేజ‌ల‌కు నోటీసులు!

By - Tupaki Desk
Update: 2017-07-17 15:14 GMT
టాలీవుడ్ ను కుదిపేస్తున్న‌ డ్ర‌గ్స్ కేసులో ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు ఎక్సైజ్ కార్యాల‌యం నుంచి నోటీసులు అందిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో మొద‌టి నుంచి ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్, ర‌వితేజ‌ల పేర్లు వినిపిస్తున్నా వాళ్ల‌కు నోటీసులు అంద‌లేద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో పూరీ జ‌గ‌న్నాథ్, ర‌వితేజ‌ల‌కు ఈ రోజు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎదుట  పూరీ జగన్నాథ్‌ హాజరు కానుండ‌గా, 24న ర‌వితేజ హాజ‌రు కానున్నారు.

ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ అయిన‌ సంగతి తెలిసిందే. మరికొంతమంది ప్ర‌ముఖుల‌కు కూడా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న నేప‌థ్యంలో ఆ సినీ ప్రముఖులు సిట్‌ ముందు హాజ‌రు కాబోతున్నారు. సిట్‌ అడుగబోయే కఠినమైన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నెల 19న పూరీ జగన్నాథ్‌ - 20న హీరోయిన్ ఛార్మి - 21న ముమైత్‌ ఖాన్‌ - 22న సుబ్బరాజు - 23న శ్యాం కే నాయుడు సిట్‌ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ముందు హాజ‌రు కాబోతున్నారు. ఈ నెల 25న చిన్నాను, - 26న నవదీప్‌ -  27న తరుణ్‌ - 28న తనీష్‌, నందులను సిట్‌ విచారించనుంది. కెల్విన్‌ కాల్‌లిస్ట్‌ ఆధారంగా వీరంద‌రికీ తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో పేర్లు వినిపిస్తున్న‌ ప్ర‌ముఖులు కొంద‌రు మీడియా ముందుకు వ‌చ్చి ఈ డ్రగ్స్‌ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన సంగ‌తి తెలిసిందే. సిట్‌ దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపారు. కాగా, త‌న తండ్రికి ఈ కేసుతో సంబంధం లేద‌ని పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు ప‌విత్ర సోష‌ల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. డ్రగ్స్‌ వ్యవహారంలో తన కుమారుడికి సంబంధం లేదని హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి చెప్పిన విష‌యం విదిత‌మే. అయితే, ఈ డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఎవ‌రి పేర్ల‌ను అధికారికంగా వెల్ల‌డించ‌లేదు.
Tags:    
  • Ravi Teja 
  • Puri Jagannath 
  • Tollywood Drug Scandal 
  • Tollywood Celebs 
  • drugs case 
  • Telugu News 
  • Ravi Teja 
  • Puri Jagannath 
  • Telugu Cineam News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS