• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైట్ అందాల‌తో టాప్ లేపిన...

టైట్ అందాల‌తో టాప్ లేపిన శ‌ర్మా సిస్ట‌ర్స్

By - Tupaki Desk
Update: 2021-10-29 23:30 GMT
శర్మా సిస్ట‌ర్స్ నేహా శర్మ - ఐషా శర్మ అల్ట్రా స్టైలిష్ అవ‌తార్ ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంటుంది. ఈసారి కూడా డిజైన‌ర్ లుక్ లో `ఆఫత్ ఇ-ఇష్క్` సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. నేహా మినీ రొంపర్ లు ధరించగా.. ఐషా బ్యాగీ జీన్స్ లో అదరగొట్టింది.  ముగ్ధ‌ మనోహరమైన రూపాలతో  సిస్ట‌ర్స్ క‌ళ్ల‌న్నీ త‌మ‌వైపే తిప్పేసుకున్నారు. టైట్ అందాల‌తో టాప్ లేపిన శ‌ర్మా సిస్ట‌ర్స్ గురించి ఈవెంట్ ఆద్యంతం యూత్ అదే ప‌నిగా ముచ్చ‌టించుకున్నారు. ఇక ఇటీవ‌లే శ‌ర్మా సిస్ట‌ర్స్ ఏ వేదిక‌కు వెళ్లినా అందాల విందుతో గమ్మ‌త్తుగా మ‌త్తు చ‌ల్ల‌డం  చ‌ర్చ‌కు వ‌స్తోంది. సోష‌ల్ మీడియాల్లోనూ ఈ భామ‌లు అస్స‌లు త‌గ్గ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇక ఓ చాటింగ్ సెష‌న్ లో నేహా త‌న‌పై గ‌తంలో జ‌రిగిన ఓ ఆకృత్యం గురించి గుర్తు చేసుకుంది. తన అస‌భ్య‌క‌ర మార్ఫింగ్ ఫోటో ఒక‌టి ఆన్ లైన్ లో షేర్ అయిన‌ తర్వాత  సెట్ లోని వ్యక్తులు తనతో విచిత్రంగా ప్రవర్తించారని నేహా శర్మ చెప్పారు. నేహా శర్మ కొన్ని సంవత్సరాల క్రితం వైరల్ అయిన తన మార్ఫింగ్ ఫోటో గురించి ఇప్పుడు మ‌రోసారి గుర్తు చేసింది.

మార్ఫింగ్ చేసిన ఫోటో చూసి మొదట్లో బాధపడ్డాను అని చెప్పింది. ఇంత‌కీ ఇది ఎలాంటి ఫోటోగ్రాఫ్ అంటే.. నేహా స్వ‌యంగా ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన సెల్ఫీని బ్యాక్ గ్రౌండ్ మార్చేసి సెక్స్ టాయ్ ని జోడించారు ఆక‌తాయిలు. అది చూసి మొదట్లో తాను చాలా బాధపడ్డా చివరికి శాంతించానని శ‌ర్మ గాళ్ చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో నేహా తన వెబ్ సిరీస్ `ఇల్లీగల్` సెట్స్ పైకి వెళ్లిన‌ప్పుడు మారిన త‌న ఇమేజ్ గురించి తెలుసుకున్నానని అందరూ తనతో 'వింతగా' ప్రవర్తించార‌ని చెప్పారు.

నేహా ఇంకా మాట్లాడుతూ “డ్యూడ్ ఇది ఒక‌ పిచ్చి. ఈ రకమైన మార్ఫింగ్ దుర్మార్గం. నేను నిస్సందేహంగా చిన్నపిల్ల‌ను కాబట్టి ఆ సమయంలో ఏం చేయాలో మెద‌డుకు తోచ‌లేదు. ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు? ఈ s**t తో చెత్త‌ప‌నులు చేసేందుకు జాబ్ లెస్ గా ఉన్నారేమిటీ?`` అంటూ సీరియ‌స్ అయ్యారట‌.

ఇల్లీగల్ సెట్స్ లో వైరల్ అయిన ఫోటో గురించి ఎవరో తనకు తెలియజేశారని నేహా తెలిపింది. ఆ ఫోటో గురించి ఏదీ నాకు అర్థం కాలేదు. నేను సెట్ కి వచ్చాను. అందరూ కాస్త విచిత్రంగా.. వింతగా ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడలేదు. అందరూ చర్చించుకుంటున్నారు. గొణుగుడు వినిపించింది. నేను ఇలా ఉన్నాను. ఏం జరుగుతోంది? అందరూ ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? అనుకున్నాను. చివరికి ఎవరో నా దగ్గరకు వచ్చి 'నేహా.. ఇదిగో నీ ఫోటో వైరల్ అవుతోంది' అన్నారు.. 'ఏం చిత్రం?' అని నేను చూశాను, నేనూ. నేను (షాక్ తో నోరు తెరిచి) వావ్! చాలా క్రియేటివ్‌గా ఉన్నాను. ఎవరు చేసారో.. అన్నాను. నేను మొదట్లో బాధపడ్డాను.. కానీ తర్వాత నేను.. అది సరే.. నిజం ఏమిటో నాకు తెలుసు. నాకు అవి నిజంగా అవసరం లేదు.. నన్ను సంతృప్తి పరచడానికి..!`` అని బ‌హిరంగంగా చెప్పాను.. అని తెలిపారు నేహా. తన చిత్రాన్ని డిజిటల్ గా మార్ఫింగ్ చేసిన వ్యక్తిని నేహా తిట్టేసింద‌ట‌. మనుషులు ఎంత స్త్రీద్వేషిగా ఉంటారనేది విచారకరం... ఫోటోలను మార్ఫింగ్ చేయడం.. దాని నుండి చౌకగా థ్రిల్స్ పొందడం మానేయండి..అంటూ క్లాస్ తీస్కుంది. ఇది అసలు ఫోటో అంటూ ఒరిజిన‌ల్ ని చూపించింది.

2010లో ఇమ్రాన్ హష్మీ సరసన క్రూక్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నేహా... క్యా సూపర్ కూల్ హై హమ్.. యమ్లా పగ్లా దీవానా 2.. యంగిస్తాన్ ..తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ వంటి చిత్రాలలో నటించింది. ప్ర‌స్తుతం త‌న సోద‌రి ఐషా శ‌ర్మ కెరీర్ ని షేప‌ప్ చేసేందుకు తీవ్రంగానే శ్ర‌మిస్తోంది.
Tags:    
  • Neha Sharma 
  • Aisha Sharma 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS