షన్నూ దీపూ బ్రేకప్ పై సిరి పోస్ట్.. వెంటనే డిలీట్
తెలుగు సోషల్ మీడియాను ప్రస్తుతం కుదిపేస్తున్న ఇష్యూ షన్నూ మరియు దీప్తిల బ్రేకప్. వారి అభిమానులు.. విమర్శకులు.. సాదారణ ప్రేక్షకులు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై స్పందిస్తున్నారు. నెట్టింట వీరి బ్రేకప్ కు కారణం ఖచ్చితంగా బిగ్ బాస్ లో షన్నూ వ్యవహారం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ ముగిసిన కొన్ని రోజుల వ్యవదిలోనే ఈ బ్రేకప్ అయ్యింది కనుక నెటిజన్స్ అనుకుంటున్న విషయం కూడా నిజం అయ్యి ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు విషయం ఏంటీ అనేది తెలియదు కాని.. సిరి వల్లే ఈ బ్రేకప్ అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సిరి స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
సిరి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా.. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ జీవితం కఠినంగా ఉందని అంటే దానికి నేను అంతకంటే ఠఫ్ అని సమాధానం చెప్పి నవ్వండి అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది. ఆ కొటేషన్ ను నలుగురు నాలుగు రకాలుగా అనుకోవడం.. ఆ కొటేషన్ ఖచ్చితంగా షన్నూకు తన మద్దతు తెలుపుతు సిరి చెప్పింది అంటూ కామెంట్స్ రావడంతో సిరి వెంటనే ఆ కొటేషన్ ను డిలీట్ చేసింది.
సిరి డిలీట్ చేసినా కూడా అప్పటికే కొందరు ఆ పోస్ట్ ను స్క్రీన్ షాట్స్ తీసుకోవడం ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సిరి ఆ కొటేషన్ తో బ్రేకప్ గురించి స్పందించిందని.. దీప్తి విషయంలో షన్నూ కు మద్దతుగా నిలిచే విధంగా ఆమె పోస్ట్ ఉందని.. ఈ కష్టంను చిరు నవ్వుతో ఎదుర్కోవాల్సిందిగా షన్నూకు సలహా ఇచ్చినట్లుగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సిరి ఏ ఉద్దేశ్యంతో ఆ పోస్ట్ ను పెట్టిందో కాని చాలా మంది మాత్రం ఆ ఆమె ఉద్దేశ్యంను పలు రకాలుగా ఊహించేసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి చాలా సున్నితంగా మారింది. కనుక ఇలాంటి సమయంలో సిరి నుండి ఎలాంటి పోస్ట్ పడ్డా దాన్ని అంతా కూడా చాలా తెలివిగా వారి బ్రేకప్ కు మార్చి అన్వయించి ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి.
ఇటీవల తన కాబోయే భర్త శ్రీహాన్ తో కలిసి సిరి న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంది. ఆ వీడియోను షేర్ చేయడంతో చాలా మంది చాలా రకాలుగా ఆ వీడియోకు కూడా బ్యాడ్ కామెంట్స్.. నెగటివ్ కామెంట్స్ ను చేశారు. షన్నూ మరియు దీప్తిల వ్యవహారంతో కలిపి పలువురు సిరి ఆ వీడియోకు కామెంట్స్ చేస్తూ సిరిని విమర్శించారు. అలాంటి విమర్శలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే సిరి వెంటనే డిలీట్ చేసి ఉంటుంది అనిపిస్తుంది. మొత్తానికి ఈ విషయంలో సిరి కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండటం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.