మెగా మూవీపై మేక‌ర్స్ మౌనం వీడ‌క త‌ప్ప‌దా?

ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లై దాదాపు 15 నెల‌లు కావ‌స్తోంది. అయినా స‌రే ఇప్ప‌టికీ దీని రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.;

Update: 2026-04-06 06:51 GMT

మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నారు. ఇట‌వ‌ల సంక్రాంతికి `మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్‌గారు` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని త‌న ఖాతాలో వేసుకున్న చిరు అదే జోష్‌తో మ‌రో సినిమాని రంగంలోకి దించేస్తాడ‌ని, అదే ఊపుతో మ‌రో మూవీకి శ్రీ‌కారం చుట్టేస్తాడ‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాద‌ని జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. `మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్‌గారు`కు ముందు చిరు మొద‌లు పెట్టిన భారీ గ్రాఫిక‌ల్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ `విశ్వంభ‌ర‌`. మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడు. సినిమా పూర్త‌యింది. యువీ క్రియేష‌న్స్ వారు నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లై దాదాపు 15 నెల‌లు కావ‌స్తోంది. అయినా స‌రే ఇప్ప‌టికీ దీని రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. టీమ్ నుంచి ప్ర‌క‌ట‌నా లేదు. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయి క్వాలిటీగా లేవ‌ని గ్లింప్స్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో సినిమా రిలీజ్‌ని మేక‌ర్స్ నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. గ‌త ప‌దిహేను నెల‌లుగా గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుగుతున్నా దానికి సంబంధించిన అప్ డేట్‌ని మేక‌ర్స్ ఇవ్వ‌డం లేదు. సినిమా రిలీజ్‌పై క్లారిటీకి రావ‌డం లేదు. అయితే ఇదే సంస్థ నిర్మించిన `బైక‌ర్‌` మాత్రం ఎలాంటి అడ్డంకులు, వాయిదాలు లేకుండా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది.

దీంతో `బైక‌ర్‌`పై ఉన్న క్లారిటీ `విశ్వంభ‌ర‌`పై ఎందుకు రావ‌డం లేద‌ని. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన మేక‌ర్స్ ఎందుకు స్పందించ‌డం లేద‌నే కామెంట్‌లు ఇప్ప‌డు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే మేక‌ర్స్ స్పందించాల్సిందేన‌ని అభిమానులు, నెటిజ‌న్‌లు కోరుతున్నారు. మ‌రి మేక‌ర్స్ స్పందిస్తారా? లేక ఎప్ప‌టిలాగే మౌనం పాటిస్తారా? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే మెగాస్టార్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన బాబి ప్రాజెక్ట్ కూడా ప‌ట్టాలెక్క‌డానికి అంతకంత‌కు ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ని విజ‌య్‌తో `జ‌న నాయ‌గ‌న `టాక్సిక్‌` మూవీల‌ని నిర్మించిన వెంక‌ట్ కె. నారాయ‌ణ నిర్మించ‌బోతున్నారు. తెలుగులో ఆయ‌న‌కిదే తొలి ప్రాజెక్ట్‌. దీన్ని ప్ర‌క‌టించి చాలా నెల‌లే అవుతున్నా ప‌ట్టాలెక్కించాడానికి మాత్రం ఇప్ప‌టికీ మేక‌ర్స్ లో క్లారిటీ రావ‌డం లేదు. కార‌ణం `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ ఆల‌స్యం కావ‌డం, `అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్ పై చేస్తున్న వార్ కార‌ణంగా `టాక్సిక్‌` రిలీజ్ వాయిదా ప‌డ‌టంతో మెగా ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.

చిరు చేయ‌నున్న భారీ ప్రాజెక్ట్ కావ‌డం, `వాల్తేరు వీర‌య్య‌` త‌రువాత బాబి డైరెక్ష‌న్‌లో చిరు చేస్తున్న సినిమా కావ‌డంతో దీని ప్రారంభం కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చిరు 158వ ప్రాజెక్ట్‌గా ప‌ట్టాలెక్క‌నున్న ఈ మూవీ విష‌యంలో మేక‌ర్స్ స్పందిస్తే కానీ ఇది ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే విష‌యంలో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా `విశ్వంభ‌ర‌` గురించి యువీ, చిరు 158 గురించి కెవిఎన్ బ్యాన‌ర్స్ స్పందిచాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి వీరిద్ద‌రు స్పందస్తారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News